కాగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేత మన తిరంగ (త్రివర్ణ) పతాకం మొదటి ఆవిష్కరణ జరిగింది ఇక్కడేనని అమిత్ షా తెలిపారు. అలాగే వీర్ సావర్కర్, ఇతర స్వాతంత్ర్య సమరయోధులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సెల్యులార్ జైలు కూడా ఇదే అని గుర్తు చేశారు. ‘మన చరిత్ర, స్వాతంత్ర్య పోరాటంలో అండమాన్, నికోబార్ దీవులకు అసమానమైన స్థానం ఉంది. ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి నావికా స్థావరంగా పని చేసిన ద్వీప భూభాగం నేడు మన వ్యూహాత్మక, అభివృద్ధి ఆకాంక్షలకు కీలకమైన స్థావరంగా ఉంది’ అని అమిత్ షా పేర్కొన్నారు.
మరోవైపు ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటీష్ కలోనియల్ నేవీ అధికారి కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరుతో అండమాన్, నికోబార్ దీవుల రాజధానికి పోర్ట్ బ్లెయిర్‌గా నామకరణం చేశారు. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళిగా ఇందులోని 21 దీవుల పేర్లను మారుస్తున్నట్లు 2018లో ప్రధాని మోదీ ప్రకటించారు. రాస్ ద్వీపం, నీల్ ఐలాండ్, హేవ్‌లాక్ ద్వీపాల పేర్లను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్, షాహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్‌గా మార్పు చేశారు.
More Stories
జమ్ముకాశ్మీర్ లో ఆర్మీ జెసిఓ వీరమరణం
పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఆస్ట్రేలియా నిషేధం
మణిపూర్లో గిరిజనుల ఇళ్లకు నిప్పు.. మంటల్లో మహిళ మృతి