* హైదరాబాద్ భక్తుడు బలగాని బలరాజ్ తో సహా ముగ్గురు భక్తులు మృతి
బాధితుల్లో గోపాల్ మిశ్రా (76) యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా అనారోగ్యం కారణంగా మరణించారు. నవగంజి లక్ష్మన్‌జీ ఠాకూర్ (52) అనే వ్యక్తి యాత్రకు వెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన బలగాని బలరాజ్ (49) కూడా అనారోగ్యం కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ వాతావరణ సరిగ్గా లేకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులు వెళ్లే రూట్లను మూసివేసి, వారికోసం వసతులు ఏర్పాటు చేశారు.
శనివారం నుంచి రుద్రప్రయాగ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల భక్తులు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. అందుకే తాత్కాలికంగా యాత్రను నిలిపివేశారు. మళ్లీ వాతావరణం సాధారణ స్తితికి వచ్చిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభిస్తారు. ఈ మేరకు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు. ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులు అధికారులు సూచించిన చోట మాత్రమే ఉండాలని కోరారు.
మరోవంక, ఉత్తరాఖండ్ పుణ్యక్షేత్రాలకు వెళ్లే చార్‌ధామ్ యాత్ర ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ప్రధాన రహదారులు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా జోషిమఠ్ నుండి బద్రీనాథ్ వరకు 25 నుండి 30 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో యాత్రికులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది.
యాత్రికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి గంటల సమయం పడుతుండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్, గోవింద్‌ఘాట్, సోన్‌ప్రయాగ్ వంటి ప్రముఖ ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ విపరీతంగా ఉంది. రోడ్లపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఎండలో ఇబ్బందులు పడుతున్నారు.
ట్రాఫిక్ జామ్ కారణంగా మార్గమధ్యంలో ఆహారం, తాగునీటి సదుపాయాలు సరిగ్గా అందడం లేదు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలతో ప్రయాణించే వారికి ఈ పరిస్థితి కష్టంగా మారింది. ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు వేగవంతం చేశారు.

More Stories
గాజియాబాద్‌లో విద్యార్థి హత్యకేసులో నిందితుడి ఎన్కౌంటర్
రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం
సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి