ఈ సందర్భంగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస సూర్య కాంత్‌లతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. “ప్రాసిక్యూషన్,విచారణ పక్రియ అనేది ఒక పెద్ద శిక్షగా మారకూడదు. ఈ విషయాన్ని అన్ని కోర్టులు పాటించాలి,” అని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ స్పష్టం చేశారు. అంతేకాదు కేజ్రీవాల్‌ని సీబీఐ అరెస్ట్ చేసిన విధానం, టైమింగ్‌ని కూడా ఆయన ప్రశ్నించారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరును నిరుత్సాహపరిచేందుకే సీబీఐ అరెస్టు చేసి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. సహాయ నిరాకరణ అంటే నేరాన్ని అంగీకరిస్తున్నట్టు కాదని, అందువల్ల కేజ్రీవాల్‌ని సీబీఐ అరెస్టు చేయడం సరికాదని స్పష్టం చేశారు. సీబీఐకి ‘బంధిచిన చిలుక’గా ఉన్న ముద్రను తొలగించుకోవాలని సూచించారు.
కేజ్రీవాల్ పిటిషన్లపై ఇప్పటికే ఇరువర్గాల వాదనలు విన్న బెంచ్ 5న కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తాజాగా తీర్పును వెలువరించింది. కేజ్రీవాల్‌కు గతంలో సుప్రీంకోర్టు ఈడీ కేసులో బెయిల్ ఇచ్చింది. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ మార్చి 21న అరెస్టు అయిన విషయం తెలిసిందే.
ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. జూలై 12న ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆయన తీహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. సీబీఐ కేజ్రీవాల్‌ని అరెస్టు చేయడాన్ని ఇన్సురెన్స్ అరెస్టుగా పేర్కొన్నారు.
సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. మద్యం పాలసీ కేసులోని సొత్తును 2022లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించిందని తెలిపారు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడంపై సైతం అభ్యంతరం తెలిపారు. బెయిల్ కోసం ముఖ్యమంత్రి ఎప్పుడూ ట్రయల్ కోర్టును ఆశ్రయించలేదన్నారు.
More Stories
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం
జమ్ముకశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా
జమ్ము కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి, హర్యానాలో బిజెపి