అదే సమయంలో రష్యా, చైనా కీలక అధికారులతో ఆయన భేటీ కానున్నారు. గత నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ ఫోన్ మాట్లాడిన సమయంలో డోభాల్ పర్యటన అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ ఎన్‌ఎస్‌ఏల సదస్సు సమయంలో ఉక్రెయిన్ శాంతి కోసం ఆలోచనలను ఆయన పంచుకుంటారని వెల్లడించినట్లు సమాచారం. తాము ముందునుంచి చెబుతున్నట్టు శాంతియుత పరిష్కారం ద్వారా యుద్ధం ముగించాలనే వైఖరికి భారత్ కట్టుబడి ఉందని మోదీ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.
. గడచిన రెండు నెలల్లో రష్యా, ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్, జెలెన్‌స్కీలతో సమావేశమై శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరువురి నేతలకు సూచించారు. ఆ సమయంలో చర్చలు, దౌత్యమే యుద్ధానికి పరిష్కార మార్గాలని సూచించారు. తన వ్యక్తిగత హోదాలో ఓ మిత్రుడిలా ఉక్రెయిన్ శాంతి కోసం రష్యాతో మధ్యవర్తిత్వం చేస్తానని ఆఫర్ చేశారు. “యుద్ధంలో భారత్ ఏమాత్రం తటస్తంగా లేదు. కేవలం శాంతి పక్షమే వహిస్తోంది” అని మోదీ పేర్కొన్నారు.
అయితే, జెలెన్‌స్కీ నుంచి సానుకూల సమాధానం రాలేదు. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశం యుద్ధం కొనసాగించేందుకు భారత్ మద్దతు ఇస్తున్నట్లు గుర్తు చేస్తూ, ఇటీవల యుద్ధం ఆపాలని జరిగిన అంతర్జాతీయ సమావేశం ప్రకటనపై భారత్ సంతకం చేయలేదని ప్రస్తావించారు. భారత్ ప్రతిపాదిస్తున్న శాంతి సందేశంపై స్పష్టత కలిగితే గాని తాను స్పందించలేనని ప్రధాని మోదీ ఇంకా తమ దేశంలో ఉండగానే పేర్కొన్నారు.
మరోవైపు తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ శాంతి స్థాపనకు చైనా, భారత్ కీలక పాత్ర పోషించగలవని ఆమె తెలిపారు. క్రెయిన్ వివాద పరిష్కారానికి ఇటలీ మద్దతు ఉంటుందని మెలోని ప్రకటించారు. దేశ జాతీయ సమగ్రతను కాపాడేందుకు రూపొందిచిన నియమాలను పరిరక్షించే లక్ష్యంతో పాటు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వివాద పరిష్కారంలో భారత్, చైనాలు కీలక పాత్ర పోషిస్తాయని తాను నమ్ముతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
More Stories
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉష