
మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో శనివారం నాడు ఘర్షణలు చెలరేగడంతో ఐదుగురు మరణించారు. ఒక వ్యక్తిని నిద్రలో కాల్చి చంపిన తర్వాత, పోరాడుతున్న రెండు వర్గాలకు చెందిన సాయుధ పురుషుల మధ్య జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మరణించారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
జిల్లా కేంద్రానికి 5 కి.మీ.ల దూరంలో ఉన్న ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా నివసిస్తున్న వ్యక్తి ఇంట్లోకి మిలిటెంట్లు ప్రవేశించి నిద్రలోనే కాల్చి చంపారని తెలిపారు. హత్యానంతరం, జిల్లా కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల్లో పోరాడుతున్న వర్గాలకు చెందిన సాయుధ పురుషుల మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి.
ముగ్గురు కొండల ఆధారిత ఉగ్రవాదులతో సహా నలుగురు సాయుధ వ్యక్తులు మరణించారని ఆ అధికారి తెలిపారు. అనుమానిత మిలిటెంట్లు గ్రామాలపై రాకెట్లను ప్రయోగించడంతో బిష్ణుపూర్ జిల్లాలో ఒక వ్యక్తి మరణించి, మరో ఐదుగురు గాయపడిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున బిష్ణుపూర్ జిల్లాలోని ట్రోంగ్లావోబీలో తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో రెండు నిర్మాణాలను ధ్వంసం చేయడంతో ఈ అధునాతన రాకెట్‌లను ఉపయోగించే దాడులు ప్రారంభమయ్యాయి.
మణిపూర్‌లో వారం రోజుల క్రితం, రెండు రోజులుగా హింసాత్మక వాతావరణం నెలకొంది. ఇంఫాల్ వెస్ట్‌లోని గ్రామాలపై డ్రోన్‌లను ఉపయోగించి ముడి బాంబులు వేయడం వల్ల ప్రజలు మరణించారు, పలువురు గాయపడ్డారు. హింసను తీవ్రంగా ఖండిస్తూ, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ వాటిని “ఉగ్రవాద చర్యలు”గా అభివర్ణించారు.
“మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అసంకల్పిత దాడిని అత్యంత తీవ్రంగా తీసుకుంటుంది. స్థానిక ప్రజలపై జరిగే అటువంటి ఉగ్రవాద దాడులపై పోరాడేందుకు అవసరమైన విధంగా ప్రతిస్పందింస్తుంది” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మణిపూర్‌లో ఇటీవలి జరిగిన హింసాత్మక ఘటనలతోమణిపూర్ విద్యా శాఖ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను సెప్టెంబర్ 7న మూసివేయాలని ఆదేశించింది.
లోయ ఆధారిత పౌర సమాజ సంస్థ మణిపూర్ సమగ్రతపై కోఆర్డినేషన్ కమిటీ కూడా నిరవధిక “పబ్లిక్ ఎమర్జెన్సీ”ని ప్రకటించింది. నిరంతరాయంగా దాడులను ఉటంకిస్తూ వారి తమ జీవితాలు నిరంతరం ముప్పులో ఉన్న ప్రజల భద్రత కోసం అత్యవసర పరిస్థితి విధించచమని, మణిపూర్‌లో పరిస్థితి చక్కబడే వరకు ఎమర్జెన్సీ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
More Stories
ఢిల్లీలో బిజెపి సునామి.. యాక్సిస్ మై ఇండియా అంచనా
2027లో చంద్రయాన్-4 మిషన్ ప్రయోగం
ఛత్తీస్‌గడ్‌లో మరో నలుగురు మావోలు మృతి