నవంబర్ 12, 2024 నుండి విస్తారా సేవలు నిలిచిపోనున్నాయి. అలాగే, నవంబర్ 11, 2024 తర్వాత విస్తారా విమానాల కోసం అన్ని బుకింగ్ లను నిలిపివేస్తుంది. నవంబర్ 11 లోపు చేసే ప్రయాణాలకు బుకింగ్స్ చేసుకోవచ్చు. విస్తారాతో విమానాలను బుక్ చేసుకున్న లేదా డిసెంబర్ నెలలో బుకింగ్ చేసుకునే ప్రణాళికలు ఉన్న చాలా మంది ప్రయాణీకులకు ఇది కచ్చితంగా ఆందోళన కలిగిస్తుంది.
విస్తారా ఇప్పుడు ప్రయాణికులు, ఉద్యోగులతో కమ్యూనికేషన్ ప్రారంభించింది. కంపెనీలో చోటు చేసుకున్న మార్పుల గురించి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వెల్లడించారు. ఎయిర్ ఇండియా కు షిఫ్ట్ కావడం గురించి ఇమెయిల్స్ ద్వారా లాయల్టీ సభ్యులు, ప్రయాణీకులకు సమాచారం అందిస్తున్నారు.
విస్తారా ఎయిర్ ఇండియాలో విలీనమైన నేపథ్యంలో, విస్తారాగా ఉనికిలో ఉండదు. విస్తారాకు సంబంధించిన విమానాలు, ఉద్యోగులు, ట్రావెల్ రూట్స్ ఇలా అన్నీ ఎయిరిండియాలో భాగమవుతాయి. 2024 నవంబర్ 11న విస్తారా తన చివరి విమానాన్ని నడపనుంది. విమానాలు, మానవ వనరుల బదిలీ అంతకు ముందే ప్రారంభమవుతుంది.
విస్తారా బ్రాండ్, ఐఎటిఎ కోడ్, కార్యకలాపాల పూర్తి షిఫ్ట్ ఓవర్ వంటి మార్పులు కాలక్రమంలో పూర్తవుతాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ నంబర్, ఏఐ ప్రీ ఫిక్స్ తో విస్తారా నెట్వర్క్ విమానాలు కొనసాగుతాయి. ఈ నెల 3వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. విస్తారా సిబ్బంది 2025 ప్రారంభం వరకు ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలో విస్తారా విమానాలను నడుపుతారు. అయితే సర్వీస్ లెవల్స్, మీల్స్ మొదలైనవి ఎయిర్ ఇండియా పాలసీ ప్రకారమే ఉంటాయి.
More Stories
నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం
మహా కుంభ మేళాకు వెళ్లే వారికి 13వేల రైళ్లు
బిలియనీర్లు అధికంగా ఉన్న దేశాలలో మూడో స్థానంలో భారత్