కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈకేసు విచారణను కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో అందరి దృష్టి సీబీఐపైనే పడింది.30 మంది సభ్యుల సిబిఐ బృందంలో సిబిఐలో ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు దర్యాప్తులో కీలక పాత్ర వహిస్తున్నారు.
జార్ఖండ్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి సంపత్ మీనా దర్యాప్తును పర్యవేక్షిస్తుండగా, `లేడీ సింగం’గా పేరొందిన ఏఎస్పీ సీమా పహుజా క్షేత్రస్థాయిలో దర్యాప్తుకు సారథ్యం వహిస్తున్నారు.
సిబిఐ ఆదనపు డైరెక్టర్ గా ఉన్న సంపత్ మీనా 2020లో హత్రాస్ అత్యాచారం, హత్య కేసుతో పాటు 2017లో ఉన్నావ్ అత్యాచారం కేసును చేధించారు. ఆమెతో పాటు హత్రాస్ దర్యాప్తు బృందంలో భాగమైన అధికారి సీమా పహుజా కూడా ఉన్నారు. రాజస్థాన్ కు చెందిన సంపత్ మీనా ఓ ఐపీఎస్ అధికారి కుమార్తె కాగా, ఝాడఖండ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి భార్య.
2017లో హిమాచల్ ప్రదేశ్ లోని ఓ అటవీ ప్రాంతంలో పాఠశాల నుండి ఇంటికి తిరిగివస్తున్న ఓ 16 సంవత్సరాల విద్యార్థినిపై అత్యాచారంకు పాల్పడి, హత్య చేసిన కేసు తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఎటువంటి ఆచూకీ కనుగొనలేకపోయారు. హైకోర్టు సీబీఐకి అప్పచెప్పింది. 2021లో ఆమెకు ప్రెసిడెంట్ మెడల్ లభించింది.
ఉన్నావ్ అత్యాచారం కేసు లో దట్టమైన అటవీ మార్గం గుండా వెళ్ళే మార్గంలో ఆమె అపహరణకు గురైంది. రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెపై అత్యాచారం చేసి గొంతుకోసి చంపారు. 2018 ఏప్రిల్‌లో అధునాతన డీఎన్ఎ సాంకేతికతను ఉపయోగించి కేసును సిబిఐ ఛేదించింది. 1000 మందికి పైగా స్థానికులను విచారించిన తరువాత, వారిలో 250 మందికి పైగా వ్యక్తుల డీఎన్ఎను పరీక్షించారు.
నిందితుడి తండ్రిలో ఫోరెన్సిక్ నమూనాలకు సరిపోలినట్లు కనుగొన్నారు. బెయిల్‌పై బయటకు వచ్చి పరారీలో ఉన్న కొడుకు ఆచూకీ లభించింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బాలిక తండ్రి మరణానికి కూడా అతనే దోషిగా తేలింది. ఇప్పుడు అతను 10 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత యువతిపై నలుగురు అగ్రవర్ణాల వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మహిళ రెండు వారాల తర్వాత న్యూఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా లేదా వారి సమక్షంలో కాకుండా ఆ మహిళను దహనం చేశారనే ఆరోపణలతో సహా ఉత్తరప్రదేశ్ పరిపాలన ఈ కేసును నిర్వహించడం తీవ్ర సంచలనానికి దారితీయడంతో సిబిఐ దర్యాప్తు చేపట్టవలసి వచ్చింది. ఈ కేసులో నలుగురు నిందితుల్లో ముగ్గురు విడుదల కాగా, నాల్గవ వ్యక్తి, సందీప్ ఠాకూర్ ను దోషిగా నిర్ధారించారు.
30 మంది సభ్యుల బృందంలో సీబీఐ అధికారులు, సీఎఫ్ఎస్ఎల్ నిపుణులు ఉన్నారు. ఈ టీమ్‌కు జార్ఖండ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సంపత్ నెహ్రా నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందం సాక్ష్యాలను కనుగొనడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
లేడీ సింగంగా పేరున్న సీమా పహుజా 1993లో ఢిల్లీ పోలీస్ లో సబ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా రిక్రూట్ అయ్యారు. సీబీఐలోని అవినీతి నిరోధఖ శాక స్పెషల్ క్రైమ్ యూనిట్‌లో చాలా కాలం పని చేశారు. ఐదేళ్లకు ఇన్‌స్పెక్టర్‌గా పదొన్నతి సంపాదించారు. ఈ సమయంలో ఆమె కీలకమైన కేసులను ఛేదించారు. ఆమె ఇన్వెస్టిగేషన్స్ స్కిల్స్ చూసి పై అధికారులు మెచ్చుకునేవారు. తర్వాత 2013లో డీఎస్పీగా పదోన్నతి ఇచ్చారు.
డీఎస్పీ అయిన తరువాత మానవ అక్రమ రవాణా, మతమార్పిడి, హత్యలు, బాలికలపై నేరాలకు సంబంధించిన అనే కేసులపై లోతుగా దర్యాప్తు చేశారు. నిందితులకు శిక్షపడే విధంగా సాక్ష్యాలు సంపాదించారు. సిమ్లాలోని కోథాయ్‌లోని గుడియాపై అత్యాచారం హత్య కేసును ఛేదించినందుకు సీమా పహుజా వార్తల్లోకి ఎక్కారు.
ఈ కేసు దర్యాప్తును అత్యుత్తమ దర్యాప్తుగా పరిగణిస్తారు. ఓ లవ్ జిహాద్ కేసును కూడా ఆమె పట్టుకున్నారు. అంతేకాదు దేశం మెుత్తం ఉలిక్కిపడేలా చేసిన హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసును కూడా సీమా డీల్ చేశారు. ఇలా ఆమె చాలా చోట్ల పని చేసి డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. హరిద్వార్‌లో జరిగిన జంట హత్యల కేసును ఛేదించినందుకుగానూ సీమా పహుజాకు 2007లో మొదటి గోల్డ్ మెడల్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డును అందుకున్నారు. 2014లో ఆగస్ట్ 15న ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. 2018 కేంద్ర హోం మంత్రి ఎక్సలెన్సు ఇన్వెస్టిగేషన్ అవార్డుకు ఎంపికయ్యారు.
కుటుంబ బాధ్యతల కారణంగా స్వచ్చంధ పదవీ విరమణకు ప్రయత్నం చేయగా, సిబిఐ డైరెక్టర్ ఆమెను ఒప్పించి సర్వీస్ లో కొనసాగేటట్లు చేశారు. సిమ్లాకు చెందిన గుడియా హత్యాచారం కేసును ఛేదించినందుకు 2018లోనే ఉత్తమ పరిశోధనకు గానూ రూ. 50,000 నగదు పురస్కారంతో పాటు బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ కేసు దర్యాప్తును సిబిఐ అత్యుత్తమ దర్యాప్తుగా కూడా పరిగణిస్తారు.
More Stories
ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ నుండి సనాతన- బౌద్ధ ఐక్యత సందేశం
భారత శ్రామిక శక్తికి కృత్రిమ మేధస్సుతో ముప్పు
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా