భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను నింగిలోకి పంపింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఈ మేరకు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం 17 నిమిషాలపాటు ప్రయోగం కొనసాగింది.
షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. చిన్న చిన్న శాటిలైట్లను అభివృద్ధి చేయటం, అందుకు అనుకూలమైన పేలోడ్ పరికరాలను రూపొందించే లక్ష్యంలో భాగంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
‘ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్’ ఈవోఎస్-08ను తక్కువ ఎత్తులోని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఈ మిషన్ లక్ష్యం. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాలను ఈవోఎస్-08 పర్యవేక్షించనుంది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడనుంది.
ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో ఈవోఎస్‌ను అభివృద్ధి చేశారు. దాదాపు 6 నెలల తర్వాత ఇస్రో చేపడుతున్న రాకెట్ ప్రయోగమిది. కేవలం రెండు రోజుల ప్రణాళికతో చిన్న చిన్న శాటిలైట్స్‌ను తక్కువ ఖర్చుతో భూ కక్ష్యలోకి చేర్చేందుకు ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ3 రాకెట్‌తో సాధ్యమవుతుందని ఇస్రో మాజీ సైంటిస్టు ఒకరు చెప్పారు.
ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ (ఈవోఐఆర్) పెలోడ్ మిడ్-వేవ్, లాంగ్ వేవ్ ఇన్‌ఫ్రా-రెడ్‌లో చిత్రాలను క్యప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుందని ఇస్రో పేర్కొంది.
ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3 ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. భారతదేశ అంతరిక్ష నైపుణ్య కీర్తి మరోసారి సత్తా చాటిందన్న సీఎం, ఇస్రో బృందం భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
More Stories
కె వి రావుకు సి పోర్టు షేర్లు తిరిగి ఇచ్చేసిన అరబిందో!
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి