బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత హిందువులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఆదివారం కెనడాలోని డౌన్‌టౌన్ టొరంటో అంతటా వేలాది మంది కెనడా పౌరులు వీధుల్లోకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. హిందూ సంఘాలకు సంఘీభావం తెలిపి నినాదాలు చేశారు.
టొరంటో డౌన్‌టౌన్‌లో హిందూ, క్రైస్తవ, బౌద్ధ, యూదు మూలాలకు చెందిన కెనడియన్లు సమావేశమయ్యారు. బంగ్లాదేశ్‌లోని హిందువులను రక్షించడానికి కొత్తగా ఏర్పడిన ముహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిరసనకారులు కెనడియన్ ప్రభుత్వాన్ని కోరడంతో పాటు “మాకు న్యాయం కావాలి – బంగ్లాదేశ్” అనే నినాదాలు పరిసరాల చుట్టూ ప్రతిధ్వనించాయి.
టొరంటోలోని బంగ్లాదేశ్ మసీదులకు తాము ఇమెయిల్‌లు పంపామని, అయితే వారు ఇంకా స్పందించలేదని నిరసనకారులలో ఒకరు చెప్పారు. “మేము టొరంటోలోని బంగ్లాదేశ్ మసీదులకు కూడా ఇమెయిల్‌లు పంపాము. ఇప్పటివరకు, మేము వారి నుండి ఎటువంటి ప్రతిస్పందనను వినలేదు. బహుశా బహుశా వారాంతంలో వారు బిజీగా ఉండవచ్చు,” అని అతను చెప్పాడు.
పైగా, అపూర్వమైన సంఖ్యలో ప్రజలు నిరసనలో పాల్గొనడం ఓ మంచి సంకేతమని నిరసనకారులు చెప్పారు.”వారు కూడా సంఘీభావంగా నిలబడితే మేము ఇష్టపడతాము. అపూర్వమైన సంఖ్యలో ఇక్కడ పాల్గొన్నారు. ఇది మంచి సంకేతం. అయితే, కెనడా రాజకీయ నాయకులు ఇమెయిల్‌లు, ట్వీట్‌లు పంపినా, ఫోన్ చేసినా స్పందించకపోవడం విచారంగా ఉంది” అంటూ విచారం వ్యక్తం చేశారు.
అంతేకాదు, హిందువులపై జరుగుతున్న దాడులపై నిరసనలో పాల్గొన్న నాయకులు తమ ఆందోళనను ప్రదర్శించారు. హింసాకాండ నుండి తప్పించుకోవడానికి వేలాది మంది బంగ్లాదేశ్ హిందువులు పొరుగున ఉన్న భారతదేశానికి పారిపోతున్నారని తెలిపారు.
కాగా, బంగ్లాదేశ్‌లో హిందువుల ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడిని నిరసిస్తూ ఢాకా, చట్టగ్రాం నగరాలలో వరుసగా రెండోరోజూ వేలాదిమంది హిందువులు ఆందోళనలు నిర్వహించారు. వారికి సంఘీభావంగా వేలాదిమంది ముస్లింలు, విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు. మైనారిటీలను వేధిస్తున్నవారిపై విచారణ వేగవంతానికి ప్రత్యేక ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని, పార్లమెంటులో 10 శాతం సీట్లను మైనారిటీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఢాకాలోని షాబాగ్ ప్రాంతంలో నిరసన సందర్భంగా మూడు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక దాడులు పెరగడాన్ని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. దాడులను ఖండిస్తూ లండన్, వాషింగ్టన్ డీసీ సహా ప్రధాన నగరాలలో ప్రదర్శనలు నిర్వహించారు. లండన్‌లోని పార్లమెంటు భవనం ఎదుట ఆందోళనకారులు బంగ్లాదేశ్ జెండా, చిహ్నంలతో నిరసన తెలిపారు.
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వివిధ మానవహక్కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వద్ద కూడా శనివారం ఆందోళన నిర్వహించారు. కాగా, దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని బంగ్లాదేశ్ తాత్కాలిక నేత మొహమ్మద్ యూనస్ ఖండించారు. హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులను కాపాడవలసిందిగా యువతను కోరారు.
More Stories
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు దోషికి జీవిత ఖైదు
అక్రమ వలసదారులను తిప్పి పంపుతా
90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్