కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ స్థిరత్వం గురించి ప్రశ్నలు లేవదీస్తున్నందుకు ప్రతిపక్షాలను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తూర్పారబట్టారు. ఎన్‌డిఎ తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడమే కాకుండా 2029లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన విస్పష్టంగా ప్రకటించారు.
ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండు నెలల పూర్తికావొస్తోంది. అయితే 2029లో జరగబోయే 2029 లోక్‌సభ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీ దేశానికి నాలుగోసారి దేశ ప్రధాని అవుతారని, ఇక విపక్ష ఇండియా కూటమి ప్రతిపక్షంలోనే కూర్చుంటుందని అమిత్ షా జోస్యం చెప్పారు. చండీగఢ్‌లో నీటి సరఫరా ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు.
ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్పాదలుచుకున్నా ఆందోళన చెందవద్దంటా బహిరంగ సమావేశానికి హాజరైన బిజెపి కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చారు. 2029లో కూడా ఎన్డీయే అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్షాల సీట్లు పెరగడంపై మాట్లాడుతూ.. ‘కొంత విజయంతో’ ఎన్నికల్లో గెలిచినట్టు భావిస్తున్నారని, కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుందని ఆయన ప్రస్తావించారు.
గత మూడు ఎన్నికల్లోనూ బీజేపీనే అత్యధిక సీట్లు దక్కించుకుందని పేర్కొన్నారు. ‘‘కొంత విజయంతో మేము ఎన్నికల్లో విజయం సాధించేశామని వారు (ప్రతిపక్షాలు) భావిస్తున్నారు. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని వారికి తెలియదు’’ అని అమిత్ షా విమర్శించారు. అనిశ్చితిని సృష్టించాలని భావిస్తున్న వ్యక్తులు ప్రభుత్వం నడవదంటూ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు.
‘ఏవో కొన్ని విజయాలతో తాము ఎన్నికల్లో గెలిచామని వారు (ప్రతిపక్షాలవారు) భావిస్తున్నారు. మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లభించిన సీట్ల సంఖ్య కన్నా ఎక్కువగానే బిజెపి ఈ ఎన్నికల్లో (2024 లోక్‌సభ ఎన్నికలు) గెలిచిందని వారికి తెలియదు. ఎన్‌డిఎలోని ఒకే ఒక సభ్య పక్షం బిజెపికి వారి మొత్తం కూటమికి గల మొత్తం సీట్ల సంఖ్య కన్నా ఎక్కువ సీట్లు ఉన్నాయి. అస్థిరత సృష్టించాలని అనుకుంటున్న ఆ నేతలు ఈ ప్రభుత్వం నడవదని పదే పదే అంటున్నారు’ అని హోమ్ శాఖ మంత్రి చెప్పారు.
‘ఈ ప్రభుత్వం తన ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేయడమే కాకుండా తదుపరి పదవీ కాలం కూడా ఈ ప్రభుత్వానిదేనని ప్రతిపక్ష మిత్రులకు హామీ ఇవ్వదలిచాను. ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉండండి, ప్రతిపక్షంలో సమర్థంగా పని చేయడం నేర్చుకోండి’ అని అమిత్ షా హితవు చెప్పారు. ప్రతిపక్షంలో ఉండి సమర్థవంతంగా పని చేయడం నేర్చుకోండంటూ విపక్షాల ఇండియా కూటమికి అమిత్ షా సలహా ఇచ్చారు.
More Stories
సైనిక వీరులకు వందనం చక్కటి చొరవ
మహారాష్ట్రలో బంధువుల మధ్య మధ్య పోరు
నేటి నుండి 12 రోజుల పాటు కాప్ -29 సదస్సు