ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపాలించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ దాతల మధ్య ‘క్విడ్ ప్రో కో’ జరిగిందంటూ వచ్చిన ఆరోపణలో సిట్ దర్యాప్తు జరిపించాలని రెండు స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం విచారించింది.
సాధారణ చట్టం కింద చర్యలు తీసుకునే మార్గాలు ఉన్నందున దీనిపై మాజీ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించడం సరికాదని, ఆర్టికల్ 32 కింద ఈ దశలో జోక్యం చేసుకోలేమని సీజైఐ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. సిట్ విచారణకు నిరాకరించింది.
న్యాయ సమీక్షకు అర్హమైనవన్న అభిప్రాయంతో ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు అనుమతించింది. నేరపూరితమైన కార్యకలాపాలపై చర్యల కోసం చట్ట పరిధిలో వేరే పరిష్కార మార్గాలు ఉండగా ఈ కేసులను ఆర్టికల్ 32 కింద విచారణకు స్వీకరించలేమని పిటిషనర్లు కామన్ కాజ్, సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటెరెస్ట్ లిటిగేషన్, ఇతర ఎన్జీవోలకు ధర్మాసనం తెలిపింది రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు గత ఫిబ్రవరి 15న సంచలన తీర్పునిచ్చింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని, సమాచార హక్కు చట్టం ఆర్టికల్ 19(1)ను ఉల్లంఘించడమే అవుతుందని తీర్పు వెలువరించింది. బ్యాంకులు తక్షణమే ఎన్నికల బాండ్ల జారీని నిలిపివేయాలని ఆదేశించింది.
ఇదే సమయంలో విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం కూడా ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించడమనని పేర్కొంది. ఈ ఎన్నికల బాండ్ల పథకం 2018లో అమల్లోకి వచ్చింది. రాజకీయ పార్టీలు విరాళాల గురించి బహిర్గతం చేయనవసరం లేదని అందులో పేర్కొంది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించడంతో పాటు కేంద్రానికి నోటీసులు పంపింది.
More Stories
ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా
రైతులతో 14న చర్చలకు కేంద్రం సిద్ధం.. చికిత్సకు జగ్జీత్ సింగ్ అంగీకారం
సైఫ్ అలీఖాన్పై దాడి చేసిన బంగ్లాదేశ్ వాసి అరెస్ట్!