వీరంతా టీఎంసీ పార్టీపై అసంతృప్తితో ఉన్నారని, ఆ విషయాన్ని బీజేపీ నేతలకు చెప్పారని మూడోసారి ఎంపీగా ఎన్నికైన సౌమిత్రా తెలిపారు. బీజేపీలో చేరేందుకు పార్టీ పెద్దల ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఆమోదం లభిస్తే, టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని, దీంతో టీఎంసీ రాష్ట్రం నుంచి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని సౌమిత్రా ఖాన్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం లోక్‌సభలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మొత్తం 42 మంది ఎంపీలలో టిఎంసికి 29 మంది, బిజెపికి 12 మంది, కాంగ్రెస్‌కు ఒకరు ఉన్నారు. అయితే, సౌమిత్రా ఖాన్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని టీఎంసీ అంటోంది. టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ మాట్లాడుతూ తప్పుడు ప్రచారం ద్వారా లభ్ధి పొందాలని కాషాయ పార్టీ చూస్తోందని, ఉద్దేశపూర్వకంగానే బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, తమ నేతలెవరూ పార్టీని వీడే అవకాశం లేదని చెబుతున్నారు.
తాజాగా అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం టీఎంసీ నేతలపై అవినీతి కేసులు పెడుతోంది. చాలా మంది ఈ కేసులకు భయపడి బీజేపీవైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఎంసీ నేతలపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. మాజీ మంత్రి సుజిత్ బోస్‌ను ఇటీవల ఈడీ అరెస్టు చేసింది. తాజాగా టీఎంసీకి చెందిన 100 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

More Stories
జాతీయ గీతం ఆలాపనలో సరైన సాహిత్యం, ఉచ్ఛారణ తప్పనిసరి
బీహార్ లో ` ‘పశుగ్రాస కుంభకోణం’ భయంతో బిజెపి అభ్యర్థి మార్పు!
సుప్రీంకోర్టు సీజేఐపై పేపర్లు విసిరేసి దూషించిన పిటిషనర్!