తృటిలో మూడో పతాకం కోల్పోయిన మ‌నూ భాక‌ర్

షూట‌ర్ మ‌నూ భాక‌ర్ పారిస్ ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ మెడ‌ల్స్ కొట్టే అవ‌కాశాన్ని  తృటిలో చేజార్చుకున్న‌ది. మెగా ఈవెంట్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న ఆ షూట‌ర్ శనివారం  జ‌రిగిన 25మీట‌ర్ల పిస్తోల్ ఈవెంట్‌లో తృటిలో కాంస్య ప‌త‌కాన్ని పోగొట్టుకుంది. దానితో ఈ గేమ్స్‌లోనే మూడ‌వ మెడ‌ల్ అందుకునే అవ‌కాశాన్ని కోల్పోయింది. 
 
పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్ప‌టికే మ‌హిళ‌ల 10 మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్‌, మిక్స్‌డ్ 10 మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్ల‌లో మ‌నూ భాక‌ర్ కాంస్య ప‌త‌కాలు సాధించిన విష‌యం తెలిసిందే. ఇవాళ జ‌రిగిన 25 మీట‌ర్ల పిస్తోల్ ఈవెంట్ ఫైన‌ల్‌లో మ‌నూ భాక‌ర్ ప‌త‌కం కోసం తీవ్ర ప్ర‌య‌త్నం చేసింది. మ‌నూ, హంగేరియ‌న్ షూట‌ర్ మ‌ధ్య ఎలిమినేష‌న్ రౌండ్ జ‌రిగింది.
 
హ్యాట్రిక్‌తో చ‌రిత్ర సృష్టించే అవ‌కాశాన్ని మ‌నూ తృటిలో మిస్సైంది. 5 షాట్ టార్గెట్‌లో మ‌నూ కేవ‌లం మూడింటిని షూట్ చేసింది. అయితే ఎలిమినేష‌న్ రౌండ్‌లో హంగేరికి చెందిన షూట‌ర్ వెరోనికా మేజ‌ర్ 4 హిట్స్ కొట్టింది. 33 పాయింట్ల‌తో కొరియా క్రీడాకారిణి జిన్ యాంగ్ తొలి స్థానంలో ఉండ‌గా, ఫ్రాన్స్ షూట‌ర్ కామిల్లీ జెడ్‌జివిస్కీ రెండ‌వ స్థానంలో, వెరోనికా మూడ‌వ స్థానంలో నిలిచారు.
అయినా కూడా స్వాత్రంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్​ సాధించిన తొలి భారత అథ్లెట్​గా నిలిచింది. “రెండు కాంస్య పతతాలు సాధించడం సంతోషంగా ఉంది కానీ, చివరి ఈవెంట్​లో నాలుగో స్థానానికి పరిమితమైనందుకు బాధగా ఉంది” అని పేర్కొంది. తన తదుపరి లక్ష్యం 2028లో జరగబోయే లాస్​ ఏంజిల్స్​ ఒలింపిక్స్​ అని పేర్కొంది.

“నేను బాగా ఒత్తిడికి గురయ్యాను. కానీ ఆ తర్వాత నా వంతుగా కామ్​గా, పీస్​గా ఉంటూ బెస్ట్ ఔట్​ఫుట్​ ఇవ్వడానికి​ ట్రై చేశాను. కానీ అది సరిపోలేదు. ఈ ఒలింపిక్స్​ నాకు ఎంతో మంచి అనుభవంగా మారింది. అయితే ఎప్పుడూ మరో ఒలింపిక్స్ ఉంటుంది కాబట్టి ఇక దాని కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం రెండో మెడల్స్ రావడం ఎంతో ఆనందంగా ఉంది కానీ ప్రస్తుతం ఈ విభాగంలో కోల్పోవడం కాస్త బాధగానే ఉంది. నాలుగో స్థానంతో సరిపెట్టుకోవడం నాకు నచ్చలేదు”. అని చెప్పింది.

మను ఈ ఒలింపిక్స్​లో ఇప్పటికే రెండు మెడల్స్​ను సాధించడం వల్ల మూడో పతకం కచ్చితంగా సాధిస్తుందని అందరూ అంచనాలు పెంచేసుకున్నారు. అయితే దీనిపై స్పందించిన మను తన చుట్టూ ఉన్న భారీ అంచనాలు, ప్రచారాల వల్ల తన మనసు, మెదడు పరధ్యానం చెందలేదని, అన్నింటినీ పూర్తిగా స్విచ్ఛాఫ్ చేసి కేవలం తన లక్ష్యంపైనే గురిపెట్టినట్లు పేర్కొంది.

“నిజంగా చెబుతున్నాను నేను సోషల్ మీడియా జోలికి కూడా పోలేదు. నా ఫోన్ కూడా చెక్​ చేయలేదు. కాబట్టి బయట ఏం జరుగుతుందో అస్సలు తెలీదు. నా వంతుగా బెస్ట్​ ఔట్​ఫుట్ పెర్​ఫార్మెన్స్​ ​ మాత్రమే ట్రై చేస్తున్నానని తెలుసు. చాలా ఈవెంట్లలో నేను మంచి ప్రదర్శన చేశాను. కాకపోతే ప్రస్తుత ఈవెంట్​లో మాత్రమే చేయలేకపోయాను. ప్రస్తుతానికి నా మ్యాచ్​​ అయిపోయింది. ఓకే ఇక నెక్ట్స్​ టైమ్ చూద్దాం అనే ఆలోచనలో ఉన్నాను.” అని చెప్పుకొచ్చింది.

“తెరవెనుక చాలా హార్డ్​వర్క్​ కొనసాగింది. నేను ఇక్కడ ఉన్నాను అనేదే మీరు చూస్తున్నారు. కానీ చాలా మంది ప్రజలు నా వెనక ఉండి ఎంతో కష్టపడ్డారు కాబట్టే నేను ఈ పోడియంకు చేరుకోగలిగాను. అందుకే భారతదేశం పతకం సాధించగలిగింది. ఏదేమైనా నా జర్నీలో నన్నెంతగానో సపోర్ట్ చేసే ఓ టీమ్​ ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.” అని మను వెల్లడించింది.