ట్యాక్స్‌ స్కామ్‌లో సోమేశ్ కుమార్‌పై కేసు!

ట్యాక్స్‌ స్కామ్‌లో సోమేశ్ కుమార్‌పై కేసు!
తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జీఎస్టీ పన్ను లావాదేవీల్లో జరిగిన అవినీతిలో మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్ ఎస్.వి. కాశీవి శ్వేశ్వరరావు, హైదరాబాద్‌ రూరల్ డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమి టెడ్‌ నిర్వాహకుల్ని నిందితులుగా ఇప్పటికే కేసు నమోదు చేశారు. 
 
పన్ను ఎగవేతదారుల సహకరించడం ద్వారా రూ. వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు జాయింట్ కమిషనర్ కానూరి రవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేతతో వాణి జ్యపన్నుల శాఖకు రూ.1,000కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. మరో 11 ప్రైవేటు సంస్థలు సుమారు రూ.400కోట్లు ఎగవేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
మానవ వనరులను సరఫరా చేసే బిగ్ లీప్‌ టెక్నాల జీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పన్ను చెల్లించకుండా రూ.25.51కోట్ల ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ తీసుకున్నట్టు గుర్తించారు. వాణిజ్యపన్నుల శాఖకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సర్వీస్ ప్రొవైడర్‌గా ఐఐటీ హైదరా బాద్ వ్యవహరించింది. దీంతో ఐఐటీ సిబ్బందిపై కూడా కేసు నమెదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వెల్లడైంది.
 
సాధారణంగా ఒక రాష్ట్రంలోని డీలర్లు, మరో రాష్ట్రంలోని డీలర్లకు విక్రయించే వస్తువులపై ఐజీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. దీనిని కేంద్రం, వస్తువులు కొన్న రాష్ట్రానికి చెరో 50 శాతం పంపిణీ అవుతుంది. అయితే రాష్ట్రంలోని కొంతమంది డీలర్లు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. 
 
ఇక్కడి డీలర్లు ఇతర రాష్ట్రాల వారికి వస్తువులను విక్రయించినట్లుగా నకిలీ ట్యాక్స్‌ ఇన్వాయి్‌సలను సృష్టించారు. ప్రధానంగా 18 శాతం ట్యాక్స్‌ ఉన్న ఇనుము, ఇత్తడి, రాగి స్ర్కాప్‌ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆ ఇన్వాయి్‌సలలో పేర్కొన్నారు. నిజానికి ఈ వస్తు రవాణా భౌతికంగా జరగదు. కేవలం కాగితాల్లోనే సరఫరాలు ఉంటాయి. 
 
మాజీ సీఎస్‌ సోమేశ్‌ దీనిపై విచారణ జరపొద్దంటూ అప్పట్లో అధికారులపై ఒత్తిడి పెంచారు. సోమేశ్‌కుమార్‌ సీఎ్‌సగా ఉన్నప్పుడు వాణిజ్యపన్నులు, ఎక్సైజ్‌ శాఖలను తనవద్దే పెట్టుకున్నారు. రేవంత్‌ సర్కారు అధికారంలోకి రావడంతో కొత్తగా వచ్చిన అధికారులు ఈ కుంభకోణాన్ని గుర్తించారు.