ఇలా అల్లర్లు చేసేస్తే తద్వార మధ్యంతర పరిపాలన వచ్చేస్తది అనుకునే పనికిమాలిన ఆలోచనలు మానుకోవాలని హితవుపలికారు. క్రూర వ్వవహారాలేవి తనవరకు రావని అనుకోవద్దని. వీటిని ధీటుగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. కాకపోతే మీకు నేనిచ్చే ఒక మంచి సలహా ఏంటంటే ఆ హింసాత్మక చర్యలకి పెట్టే ఆ డబ్బుని పేదల కోసం పెడితే వారి పురోగతి కోసం పెడితే కనీసం ఈ సారి ప్రతిపక్ష హోదా అయిన దక్కుదని చెప్పారు.
ఇది తన సలహా అని, పాటిస్తే మంచిదని, పాటించకపోతే కూటమి ప్రభుత్వానికి మీ కుట్రలని ఎలా అరికట్టాలో బాగా తెలుసునని హెచ్చరించారు. ఇక నాగబాబు చేసిన ట్వీట్ ప్రతిపక్ష వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ పార్టీనేనని తెలుస్తున్నది. ఇదిలా ఉండగా ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయంటూ వైఎస్సార్ సీపీ అధినేత ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోలోని జంతర్‌మంతర్‌లో దీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అదేరోజున నాగబాబు ఈ ట్వీట్ ఇవ్వడం గమనార్హం.
45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని, దాడుల భయంతో దాదాపు 300 మంది వలస వెళ్లిపోయారని జగన్ ఆరోపించారు. ప్రైవేటు ఆస్తులను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 560 మంది ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అంటూ నిలదీశారు.
More Stories
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
జగన్ ప్యాలస్ లపై ఆరా తీసిన అమిత్ షా
పవన్ కళ్యాణ్ కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్