వెట్టిచాకిరిలో మగ్గిపోతున్న భారత్‌కు చెందిన 33 మంది వ్యవసాయ కూలీలకు ఇటలీ పోలీసులు శనివారం విముక్తి కల్పించారు. ఉత్తర వెరేనా ప్రాంతంలో వీరితో వెట్టిచాకిరి చేయిస్తున్న ఇద్దరు యజమానులపై దాడులు చేసి వారి నుంచి 545,300 యూరోలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కార్మికులకు మాయమాటలు చెప్పి, మోసపుచ్చిన ఇద్దరు గ్యాంగ్ మాస్టర్లను పోలీసులు అరెస్టు చేశారు.
వారి దగ్గర నుంచి 5 లక్షల యూరోలను స్వాధీనం చేసుకున్నారు.. ఈ గ్యాంగ్ మాస్టర్లు కూడా భారతీయులే, ఇటలీలోని ఉత్తర వెరోనా ప్రావిన్స్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. యంత్రం కారణంగా చేయి తెగిపోయిన భారతీయ కార్మికుడికి కనీసం వైద్యం కూడా అందించకుండా రోడ్డు పక్కనే పడవేస్తే ఆ వ్యక్తి చనిపోయిన సంఘటన జూన్‌లో చోటు చేసుకుంది. దీంతో ఇటలీలో కార్మిక శ్రమ దోపిడీ బాగా వెలుగులోకి వచ్చింది.
తాజా కేసులో వీరిని సీజనల్ వర్క్ పర్మిట్లపై ఇటలీకి తీసుకొచ్చారని, ఒక్కొక్కరు 17వేల యూరోలు చొప్పున చెల్లించాలని, అప్పుడు వారికి మంచి భవిష్యత్తు వుంటుందని హామీలిచ్చారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వారికి పొలంలో పనులు అప్పచెప్పారు. రోజుకు 10 నుంచి 12 గంటలు చొప్పున వారంలో ఏడు రోజులు పనిచేయాల్సిందే. వారిచ్చేది గంటకు కేవలం నాలుగు యూరోలు.
పర్మినెంట్ వర్క్ పర్మిట్ కోసం అదనంగా 13,000 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది. జీతం లేకుండా పనిచేస్తే ఉచితంగా ఇప్పిస్తామని నమ్మబలికారు. వాస్తవానికి ఎప్పటికీ ఆ పర్మిట్ రాదని పోలీసులు తమ ప్రకటనలో వెల్లడించారు. నిందితులు బానిసత్వం, శ్రమ దోపిడీకి సంబంధించిన నేరాలకు పాల్పడ్డారని, బాధితులకు రక్షణ, పని అవకాశాలు, చట్టపరమైన రెసిడెన్సీ పత్రాలు అందజేయనున్నామని పోలీసులు తెలిపారు.
వారు తమ అప్పులన్నీ తీర్చేవరకు అక్కడ పనిచేయాల్సిందేనని పోలీసులు తెలిపారు. వారందరినీ కట్టుబానిసల్లాగా చూశారని చెప్పారు. శాశ్వతంగా వర్క్ పర్మిట్ కావాలంటే అదనంగా 13వేల యూరోలు చెల్లించాలని, అందుకోసం ఎలాంటి వేతనాలు ఆశించకుండా ఉచితంగా పనిచేయాల్సి వుంటుందని వారిలో కొంతమందికి చెప్పారని పోలీసులు తెలిపారు.
కాగా, ఇతర ఐరోపా దేశాల మాదిరిగానే ఇటలీ కూడా వలసల ద్వారా ప్రత్యేకించి తక్కువ-చెల్లింపు ఉద్యోగాలలో మానవ వనరుల కొరత ఎదుర్కొంటోంది. వలసదారుల వర్క్ వీసా వ్యవస్థ కార్మికుల కొరతను పెంచుతోంది. కార్మిక చట్టాల ఉల్లంఘనలతో ఈ సమస్య ఉత్పనమవుతోంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఇస్టాట్ 2021 డేటా ప్రకారం.. దాదాపు 11% ఇటాలియన్ కార్మికులు చట్టవిరుద్ధంగా ఉపాధి పొందారు. వ్యవసాయ రంగంలో ఈ వాటా 23% కంటే ఎక్కువగా ఉంది.
More Stories
బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై భారత్ ఆందోళన
మాస్కోలో సిరియా అధ్యక్షుడు అసద్‌కు రష్యా ఆశ్రయం
చిన్మయ్ కృష్ణదాస్‌పై బంగ్లాదేశ్‌లో మరో కేసు