కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. అప్పటి నుంచి అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ నేతలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల బాగల్‌కోట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జేటీ పాటిల్ కూడా గ్యారెంటీలపై మరోసారి పునరాలోచన చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరారు.
మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆ పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ కూడా గ్యారెంటీలకు వ్యతిరేకంగా మాట్లాడారు. కాగా, రాయరెడ్డి తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, తాము అన్నింటినీ ఓ దారికి తీసుకొస్తున్నామని, గ్యారెంటీలను కొనసాగిస్తామని వివరణ ఇచ్చుకున్నారు.
ఖజానా మొత్తం గ్యారెంటీలకే ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఆదాయ సమీకరణకు కాంగ్రెస్ సర్కారు ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్నది. గైడెన్స్ వ్యాల్యూ ట్యాక్స్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, రవాణా వాహనాలపై అదనపు సెస్, ఈవీలపై లైఫ్ టైమ్ ట్యాక్స్, పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను పెంచేసింది. బస్సు చార్జీలు కూడా పెంచే యోచనలో ఉన్నది.
పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్ – 4 శాతం పెంపు, గైడెన్స్ వ్యాల్యూ ట్యాక్స్ – 15 నుంచి 30% పెంపు, దేశీయ లిక్కర్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ – 20 శాతం పెంపు, బీర్లపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ – 175 నుంచి 185 శాతం పెంపు, కొత్తగా రిజిస్టరైన రవాణా వాహనాలపై అదనపు సెస్ – 3 శాతం పెంపు, రూ.25 లక్షల పైబడిన ఎలక్ట్రికల్ వాహనాలపై లైఫ్‌టైమ్ ట్యాక్స్ విధింపు వంటి ఆర్ధిక భారాలను ప్రజలపై మోపారు.
More Stories
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
విశ్వాస పరీక్షలో ఫడ్నవీస్ మంత్రివర్గం విజయం