
ఇది ప్రభుత్వ విధానపరమైన అంశమని.. దీన్ని కోర్టులు పరిశీలించాల్సిన అవసరం లేదని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థినులు, ఉద్యోగులకు రుక్రమం సమయంలో నెలవారీ సెలవులు మంజూరు చేసేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది.
2023 మేలో ఇచ్చిన రిప్రజంటేషన్‌పై ఇప్పటి వరకు స్పందన లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే, కేంద్ర స్త్రీ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్యర్య భాటి ఎదుట హాజరయ్యేందుకు పిటిషనర్‌కు అనుమతి ఇచ్చింది. ఈ అంశంపై విధాన స్థాయిలో పరిశీలించి.. రాష్ట్రాలను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కేంద్ర కార్యదర్శికి కోర్టు సూచించింది.
అలాగే, రుతుక్రమ సెలవుపై ఆదర్శవంతమైన పాలసీని రూపొందించగలరేమో చూడాలని అని పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టు ఇదే వైఖరిని స్పష్టం చేసింది. మహిళా విద్యార్థినులు, ఉద్యోగులకు రుతుక్రమ సెలవులు కల్పించేలా అన్ని రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తిరస్కరించింది.
ఇది విధానపరమైన అంశమని తెలిపింది. అయితే, బీహార్, కేరళ రెండు రాష్ట్రాలు మాత్రమే రుతుక్రమ సెలవులు ఇస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, బీహార్‌లో మహిళా ఉద్యోగులకు రెండు రోజులు, కేరళలో విద్యార్థినులకు మూడు రోజుల రుతుక్రమ సెలవులు ఇస్తున్నారు.
More Stories
అమృత్‌సర్‌లో గుడిపై గ్రేనేడ్ దాడి
హనీ ట్రాప్ లో రక్షణ శాఖ ఉద్యోగి
యూపీలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్