
రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అధికారులకు సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో బీచ్‌ల దగ్గరకు ఎవరినీ అనుమతించొద్దని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, భారీ వర్షం కారణంగా రైళ్లు, విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. వానల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
భారీ వర్షాలతో తక్కువ దృశ్యమానత కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్యాహ్నం 2.22 నుంచి 3.40 గంటల వరకు రన్‌వే కార్యకలాపాలను నిలిపివేసింది. దాంతో 50పైగా విమానాలను రద్దు చేయడంతో పాటు ఆయా విమానాలను అహ్మదాబాద్, హైదరాబాద్, ఇండోర్‌కు మళ్లించారు.
వరద పరిస్థితిని సమీక్షించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే డిజాస్టర్ కంట్రోల్ రూమ్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ముంబయి గార్డియన్ మంత్రి ఎంపీ లోధా, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మంత్రి అనిల్ పాటిల్ సైతం హాజరయ్యారు. సమావేశంలో సీఎం షిండే మాట్లాడుతూ నిన్న రాత్రి నుంచి ముంబయిలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. వర్షం నీటిని తోడేందుకు 200 నీటి పంపులు, 400 బీఎంసీ పంపులు పని చేశాయని.. సెంట్రల్, హార్బర్ లైన్లలో రైళ్లు తిరిగి ప్రారంభమైనట్లు తెలిపారు.
ఈ వర్షాలు కారణంగా ముంబయులోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంధేరి, కుర్లా, భందూప్, కింగ్స్ సర్కిల్, దాదర్‌తోపాటు పలు ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. రహదారులపై మోకాలి లోతు నీరు రావడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో కార్లు, మోటారు సైకిళ్లు నీళ్లలో మునిగిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ముంబయితో పాటు ఠాణె, పాల్ఘర్, కొంకణ్ బెల్ట్‌కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
More Stories
48 స్థానాలతో బిజెపి విజయకేతనం
పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో ఢిల్లీలో విజయం
అభివృద్ధి, సుపరిపాలనే గెలిచింది