తన రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలి విడత ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రష్యాకు బయలుదేరారు. మొదట, ప్రధాని మోదీ రష్యాలో అడుగుపెట్టనున్నారు. అక్కడ మంగళవారం తన “స్నేహితుడు” రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశాలు నిర్వహించి, జూలై 9న ఆస్ట్రియాకు బయల్దేరనున్నారు.
మాస్కో ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించిన తర్వాత, సుదీర్ఘకాల మిత్రదేశాల మధ్య సంబంధాన్ని క్లిష్టతరం చేసిన యుద్ధం తర్వాత రష్యాకు ప్రధాని మొదటి పర్యటన ఇది. అక్కడ 22వ భారత్ – రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత 10వ తేదీ ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో, శాంతియుత పరిష్కారం అవసరాన్ని నొక్కి చెబుతూనే, ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని భారతదేశం ఖండించింది.
తన పర్యటనకు ముందు, ప్రధాన మంత్రి రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రశంసించారు. తమ సంబంధాలను “ప్రత్యేకమైనని” అని అభివర్ణించారు. ప్రధాన మంత్రి ప్రకారం, గత 10 సంవత్సరాలలో సంబంధాలు అభివృద్ధి చెందాయి. “తన స్నేహితుడు” పుతిన్‌తో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
అయితే, రష్యా సైన్యంలో బలవంతంగా పని చేయాల్సిన భారతీయుల సమస్యపై తాను దృష్టి సారిస్తారా లేదా అనే విషయాన్ని ప్రధాని ప్రకటనలో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా, ప్రత్యేక విలేకరుల సమావేశంలో, యుద్ధ ప్రాంతంలో భారతీయుల సమస్య ప్రధానమంత్రి ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటిగా ఉంటుందని పేర్కొన్నారు.
“ఇంధనం, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటకం, ప్రజల నుండి ప్రజల మార్పిడి వంటి అంశాలతో సహా భారతదేశం, రష్యా మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం గత పదేళ్లుగా అభివృద్ధి చెందింది” అని ప్రధాని మోదీ సోమవారం మాస్కోకు బయలుదేరే గంటల ముందు ఒక ప్రకటనలో తెలిపారు.
“నా స్నేహితుడు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక సహకారంకు సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడానికి, వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై దృక్కోణాలను పంచుకోవడానికి నేను ఎదురుచూస్తున్నాను. శాంతియుత, స్థిరమైన ప్రాంతంలో సహాయక పాత్రను పోషించాలని మేము కోరుకుంటున్నాము. ఈ పర్యటన రష్యాలోని శక్తివంతమైన భారతీయ కమ్యూనిటీని కలవడానికి నాకు కూడా అవకాశం కల్పిస్తుంది,” అని ప్రధాని వివరించారు.
కాగా, మోదీ పరట్యనకు ముందు రష్యా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మోదీ పూర్తి స్థాయి పర్యటన తమకు చాలా ముఖ్యమైనదని పేర్కొంది. ఈ పర్యటన పట్ల పాశ్చాత్య దేశాలు ఈర్ష్యతో ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ దేశం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శిఖరాగ్ర స్థాయి చర్చలు చేపడతారని వెల్లడించింది.
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత మాస్కోను ప్రధాని మోదీ సందర్శించడం ఇదే తొలిసారి. అదేవిధంగా.. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
More Stories
ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
రైతులతో 14న చర్చలకు కేంద్రం సిద్ధం.. చికిత్సకు జగ్జీత్ సింగ్ అంగీకారం