రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కమిటీ ల పేరుతో కాలయాపన చేస్తూ రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నది అని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారుల జిల్లా అధ్యక్షుల సమావేశంకు అధ్యక్షత వహిస్తూ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంను ఇక ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఈ నెల 8,9 తేదీల్లో బిజెపి కిసాన్ మోర్చా ఆద్వర్యం లో అన్ని మండల కేంద్రాల్లో రైతులకు 2 లక్షల రుణ మాఫీ, రైతు భరోసా, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పేర్కొన్న విధంగా ఆర్థిక తోడ్పాటు పంటల బీమా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మెమొరాండం తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే ఇదే డిమాండ్లతో అన్ని జిల్లా కేంద్రాల్లో కిసాన్ మోర్చా ఆద్వర్యం లో రైతు సత్యాగ్రహ దీక్ష జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తామని తెలిపారు.
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జూల ప్రేమెందర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల నుండి పారిపోయే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులతో కలసి ప్రత్యక్ష కార్యాచరణ కు దిగాలని కిసాన్ మోర్చా శ్రేణులకు పిలుపునిచ్చారు . సమావేశ నేపథ్యంలో జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని కిసాన్ మోర్చా నాయకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్ర పటానికి నివాళులు అర్పించి జాతీయ పార్టీ పిలుపు మేరకు మొక్కలు నాటారు.
12న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం
బిజెపి రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జూలై 12 ఉదయం 10 గంటలకు, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మల్లికా కన్వెన్షన్ లో రాష్ట్ర అధ్యక్షులు & కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగనుంది. ఈ సమావేశాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.
ఈ సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యులు శ్రీమతి డీకే అరుణ, రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, గరికపాటి మోహనరావు, కర్ణాటక రాష్ట్ర సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి శాసనమండలి పక్షనేత ఏవీఎన్ రెడ్డి పాల్గొననున్నారు.

More Stories
మంచిర్యాల రైతుల దుర్మరణం పట్ల బీజేపీ దిగ్బ్రాంతి
కొండా సురేఖ `శ్రీరామ్’ వాఖ్యలపై భగ్గుమన్న బిజెపి
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీకే అధికారం