అయోధ్య రామమందిరం నిర్మాణ పనులను కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రామమందిరం మొదటి అంతస్తు నిర్మాణం 90 శాతం పూర్తయ్యిందని పేర్కొంది.
వచ్చే జూలై నాటికి తొలి అంతస్తు పూర్తిగా సిద్ధమవుతుందని తెలిపారు. మొదటి అంతస్తులో రామ్ దర్బార్‌ను ఏర్పాటు చేయనున్నారు. 2025 మార్చి నాటికి ప్రాకారంతో సహా మంది నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఆ తర్వాత తొలి అంతస్తులో రామ్ దర్బార్ విగ్రహాలను పాలరాతితో తయారు చేయనున్నట్లు నృపేంద్ర పేర్కొన్నారు.
ఇందుకోసం రాజస్థాన్‌కు చెందిన నలుగురు శిల్పులతో చర్చలు జరిపారని.. టెండర్ ప్రక్రియ సైతం జారీ చేసినట్లు పేర్కొన్నారు. నెలాఖరులోగా టెండర్లు తెరువనున్నట్లు చెప్పారు. విగ్రహ తయారీకి శిల్పిని ఎంపిక చేస్తారని చెప్పారు. ఇదిలా ఉండగా.. గర్భాలయంలో కొలువుదీరిన రామ్‌లల్లాను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.
ప్రస్తుతం నిత్యం లక్ష మందికి పైగా భక్తులు తరలివస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఇప్పటి వరకు దాదాపు రెండు కోట్ల మందికి పైగా దర్శనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. సమావేశంలో రామ మందిరం నిర్మాణ పురోగతి, మ్యూజియం నిర్మాణంపై చర్చించారు.
ఇలా ఉండగా, ఇటీవల కురిసిన వర్షానికి పైకప్పు నుండి వర్షపు నీరు లీక్ కావడం ప్రారంభించిందని ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ సోమవారం ఫిర్యాదు చేశారు. ఆలయ పై భాగాన్ని సరిగ్గా నిర్మించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. నిర్మాణ దశలో ఉన్న సమస్యలేంటో గుర్తించి ఒకట్రెండు రోజుల్లా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దీనిని సత్వరమే పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో గర్భ గుడిలో పూజలు చేయడం కూడా కష్టమవుతుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
More Stories
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష
శ్రీహరికోటలో మూడవ లాంచ్‌ప్యాడ్