
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్ద పులివెందులలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆయన పార్టీ శ్రేణులే అసహనంపై గురై ఆయన ఇంటిపై రాళ్లు రావడంతో ఇంటి అద్దాలు పగిలాయి. పైగా, `వైఎస్ జగన్ డౌన్.. డౌన్’ అంటూ కొందరు కార్యకర్తలు నినాదాలు సైతం చేశారు.
ఎక్కడ్నుంచో వచ్చిన తమను జగన్‌ను చూడటానికి, కనీసం ఇంట్లోకి పంపకుండా భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అసహనంకు గురయ్యారు. ఈ ఘటనతో జగన్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు, జగన్ భద్రతా సిబ్బంది కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఊహించని పరిణామంతో వైఎస్ జగన్ సైతం దిగ్బ్రాంతికి గురయినట్లు చెబుతున్నారు. సొంత నియోజకవర్గంలోనే ఇలా జరగడంతో వైసీపీ పెద్దలు కంగుతిన్నారు.
1970వ దశకం నుండి వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చిన పులివెందులలో ఇప్పటి వరకు రాజకీయ ప్రత్యర్ధులు సహితం వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చేందుకు, వారి ఇంటిపై రాళ్లు రవ్వెందుకు ఎప్పుడూ సాహసింపలేదు. కానీ ఇప్పుడు సొంతపార్టీ శ్రేణులే అంతుకు తెగపడటం విస్మయం కలిగిస్తుంది.
ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఆయన మూడు రోజుల పర్యటనకై శనివారం పులివెందులకు చేరుకొన్నారు. ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున నియోజకవర్గ కార్యకర్తలు, నేతలు విచ్చేశారు. జగన్‌ను కలవడానికి చాలా మంది కార్యకర్తలు ప్రయత్నించగా వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ అడ్డుకుంది. దీంతో ఓటేసి గెలిపించిన మమ్మల్నే జగన్ కలవకపోవడం ఏంటి? సెక్యూరిటీ ఎందుకిలా తోసేస్తోంది? అంటూ ఆగ్రహంతో కార్యకర్తలు రగిలిపోయారు.
జగన్ ఇంట్లోకి చొరబడి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఊహించని పరిణామంతో అటు పార్టీ శ్రేణులు సైతం షాక్ అయ్యారు. పైగా, జగన్ ఈ ఐదేళ్లు పులివెందులను పట్టించుకోలేదంటూ కొందరు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఇంటిపై దాడికి యత్నించినట్టు సమాచారం. జగన్ పులివెందులలో అందుబాటులో ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. సొంత జిల్లా ప్రజలు సైతం జగన్‌కు షాకిచ్చారు. జిల్లాలో కేవలం 3 సీట్లు మాత్రమే గెలుపొందడంతో పార్టీ శ్రేణుకు తీవ్ర నిరాశ్రయులయ్యారు. గతంలో టిడిపి ప్రభంజనంలో సహితం ఇంతటి దారుణమైన ఫలితాలు రాలేదు.
More Stories
వైసీపీ మాజీ ఎంపీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ
ఫైళ్లను పట్టించుకోని చంద్రబాబు, ఆయన మంత్రులు
తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు