ఉగ్రవాదిని పట్టిస్తే రూ 20 లక్షలు బహుమతి

ఉగ్రవాదిని పట్టిస్తే రూ 20 లక్షలు బహుమతి

జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని తీర్థయాత్ర నుండి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సుపై ఆదివారం ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పది మంది మరణించారు. ఈ ఘ‌ట‌న‌లో మరో 33 మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల జాడ కోసం పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో 11 భద్రతా దళాల బృందాలు పనిచేస్తున్నాయి.

కాగా, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ఆధారంగా ఉగ్రవాది స్కెచ్‌ను పోలీసులు విడుదల చేశారు. అతని గురించి సమాచారం అందించిన వారికి రూ.20లక్షల రివార్డును ప్రకటించారు. రియాసి ఎస్పీ- 9205571332, రియాసి ఏఎస్పీ- 9419113159, ఎస్‌హెచ్‌ఓ పౌని- 7051003214 ఫోన్‌ నంబర్లకు అతడి గురించి సమాచారం తెలిస్తే అందించాలని పోలీసులు సూచించారు.

దాడిలో గాయపడిన వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగా ఉగ్రవాదులపై నిఘా ఉంచినట్లు, ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అధికారులు ప్రకటించారు. దాడి జరిగిన ప్రాంతానికి చుట్టుపక్కల సోదాలు కొనసాగుతున్నాయని,  దాదాపు 20 మందికి పైగా వ్యక్తులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.