24 మంది చంద్రబాబు మంత్రుల్లో 17మంది కొత్తవారే

24 మంది చంద్రబాబు మంత్రుల్లో 17మంది కొత్తవారే
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరిద్దరితో పాటుగా మరో 23 మంది మంత్రులూ ప్రమాణం చేయనున్నారు. పవన్‌ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను విడుదల చేయగా,  కేబినెట్‌లో ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు.
 
జనసేనకు మూడు, బీజేపీ ఒక స్థానం కేటాయించారు. సీనియర్లకు, యువతతో కొత్త మంత్రివర్గం ఉంది.  ఈ 24మందిలో సగానికిపైగా కొత్తవారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. 24మందిలో 17 మంది కొత్తవారు ఉన్నారు. ముగ్గురు మహిళలు, ఎనిమిది మంది బీసీలు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. 
 
నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశం కల్పించారు. బీజేపీ నుంచి ఎవరికి అవకాశం కల్పించాలనే అంశంపై స్పష్టత రాకపోవడంతోనే జాబితా విడుదల ఆలసమైంది. వైసిపిలో తిరిగి సీటు ఇవ్వకపోవడంతో టిడిపిలో చేరిన ఆనం రాంనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి టిడిపి నుండి ఎమ్యెల్యేలుగా ఎన్నిక కావడంతో పాటు మంత్రివర్గంలో కూడా చేరుతున్నారు. వారికి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.
1. నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి, కుప్పం)
2. కొణిదెల పవన్ కళ్యాణ్ (డిప్యూటీ సీఎం, పిఠాపురం)
3. కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి)
4. కొల్లు రవీంద్ర (మచిలీపట్నం)
5. నాదెండ్ల మనోహర్ (తెనాలి)
6. పి.నారాయణ (నెల్లూరు సిటీ)
7. వంగలపూడి అనిత (పాయకరావుపేట)
8. సత్యకుమార్ యాదవ్ (ధర్మవరం)
9. నిమ్మల రామానాయుడు (పాలకొల్లు)
10. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (నంద్యాల)
11. ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు)
12. పయ్యావుల కేశవ్ (ఉరవకొండ)
13. అనగాని సత్యప్రసాద్ (రేపల్లె)
14. కొలుసు పార్థసారధి (నూజివీడు)
15. డోలా బాలవీరాంజనేయస్వామి (కొండేపి)
16. గొట్టిపాటి రవి కుమార్ (అద్దంకి)
17. కందుల దుర్గేష్ (నిడదవోలు)
18. గుమ్మడి సంధ్యారాణి (సాలూరు)
19. బీసీ జనార్థన్ రెడ్డి (బనగానపల్లె)
20. టీజీ భరత్ (కర్నూలు)
21. ఎస్.సవిత (పెనుకొండ)
22. వాసంశెట్టి సుభాష్ (రామచంద్రాపురం)
23. కొండపల్లి శ్రీనివాస్ (గజపతినగరం)
24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (రాయచోటి)
25. నారా లోకేష్ (మంగళగిరి)