ఏపీలో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో ఏపీ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్న వారంతా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు జరగనున్న నేపధ్యంలో వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు.
జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి కి పంపించారు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మొత్తం 20 మందికి పైగా ప్రభుత్వ సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు సిఎస్ జవహర్ రెడ్డికి లేఖలు పంపించారు.
గత ఏపీ ప్రభుత్వం నియమించుకున్న, వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వ సలహాదారులు వైసిపి ఓటమికి తాము కూడా బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు.
జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, జి వి డి కృష్ణమోహన్, అజయ్ కల్లాం, శామ్యూల్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులు ఇప్పటికే తమ రాజీనామా లేఖలను సమర్పించగా, ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు.
కాగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి కూడా ప్రభుత్వానికి తన రాజీనామా పంపి తనని రిలీవ్ చెయ్యాలని దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు తన పదవీ కాలాన్ని పొడిగించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఆయన ఇప్పుడు తనను రిలీవ్ చేయమంటూ దరఖాస్తు చేయడం గమనార్హం.

More Stories
పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. ఒక్కరోజే 30 మంది మృతి
జనసేన ఫిర్యాదుతో ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు