ఐదు దశల ఓటింగ్ సమాచారం వెల్లడించిన ఎన్నికల కమిషన్

సార్వత్రిక సమరానికి సంబంధించి ప్రత్యేకించి నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ నమోదు గురించి అనేక సందేహాలతో కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నాడు కీలక సమాచారాన్ని బహిర్గతం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు జరిగిన ఐదు విడతల పోలింగ్‌లో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో పోలైన నిర్ధిష్ట ఓట్ల సంఖ్యను ఇసి ప్రకటించింది. 

ఐదు దశలకు సంబంధించి తుది పోలింగ్‌ శాతాలను గతంలోనే ఇసి విడుదల చేసింది. కానీ, ప్రతి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల వాస్తవ సంఖ్యను నిర్దిష్టంగా వెల్లడించలేదు. అత్యంత ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటు హక్కు వినియోగించుకున్న నిర్ధిష్ట ఓటర్ల సంఖ్య, శాతాలను ఎన్నికల సంఘం ఎందుకు ప్రకటించడం లేదంటూ వివిధ స్వచ్ఛంద సంస్థలు సందేహాలను వ్యక్తం చేశాయి. 

దీనిపై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) వంటి సంస్థలు కోర్టును కూడా ఆశ్రయించాయి. అయితే పోలింగ్‌ కేంద్రాల వారీగా డేటా విడుదల చేయడం గందరగోళానికి దారితీస్తుందంటూ ఇసి వాదించింది. ఈ దశలో తాము కూడా డేటా విడుదల చేయాల్సిందిగా ఇసిని ఆదేశించలేమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సంఘం డేటా విడుదల చేయడం గమనార్హం.

ఏప్రిల్‌ 19న జరిగిన మొదటి విడత పోలింగ్‌లో 21 రాష్ట్రాల్లో 11కోట్ల (11,00,52,103) మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఇసి పేర్కొంది. ఏప్రిల్‌ 26న 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన రెండో విడతలో 10.58 కోట్ల (10,58,30,572) మంది ఓటు వేశారు. 11.32 కోట్ల (11,32,34,676) మంది పౌరులు మే 7న 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడో విడత జరిగిన పోలింగ్‌లో ఓటు వేశారు.

నాల్గవ దశలో, 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 12.24 కోట్ల (12,24,69,319) మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఇసి పేర్కొంది. ఇక ఐదవ విడతపోలింగ్‌లో భాగంగా 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5.57 కోట్ల (5,57,10,618) మంది ఓటు వేశారు.

ప్రజాస్వామ్య ప్రయోజనాలను నెరవేర్చేందుకు దోహదం 

పోలింగ్‌ కేంద్రాల వారీగా డేటా అప్‌లోడ్‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తమకు మరింత స్థైర్యాన్ని ఇచ్చిందని లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఓట్ల డేటా విడుదల సందర్భంగా ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది. చెక్కుచెదరని కృతనిశ్చయంతో ఎన్నికల ప్రజాస్వామ్య ప్రయోజనాలను నెరవేర్చేందుకు ఇది, కమిషన్‌కు మరింత ఉన్నతమైన బాధ్యతను అప్పగించిందని ఇసి తెలిపింది. 

ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేందుకు కొందరు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది. పోలైన ఓట్ల డేటాను ఎవరూ మార్చలేరని స్పష్టం చేసింది. ఓటింగ్‌ రోజునే ఫారమ్‌ 17సి ద్వారా అందరి అభ్యర్థుల పోలింగ్‌ ఏజెంట్లకు ఈ సమాచారం అందచేస్తామని తెలిపింది. ఓటర్‌ టర్నవుట్‌ డేటా అభ్యర్ధులకు ఎప్పుడూ అందుబాటులోనే వుంటుందని,అలాగే పౌరులకు ఓటర్‌ టర్నవుట్‌ యాప్‌ ద్వారా నిరంతరం అందుబాటులో వుంటుందని తెలిపింది.

సాధారణంగా నూటికి నూరు శాతం పోలింగ్‌ నమోదు కావడం గొప్ప విశేషం. పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో నూరు శాతానికి మించి ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం గణాంకాల్లోనే పేర్కొనడంతో సర్వత్రా విస్మయానికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే అసలు పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలైన ఓట్ల నిర్ధిష్ట సంఖ్యను ఎందుకు తెలియజేయడం లేదంటూ ఎన్నికల సంఘాన్ని పలు స్వచ్ఛంద సంస్థలు ప్రశ్నించాయి.

రోజునే ఫారమ్‌ 17సి ద్వారా అందరి అభ్యర్థుల పోలింగ్‌ ఏజెంట్లకు ఈ సమాచారం అందచేస్తామని తెలిపింది. ఓటర్‌ టర్నవుట్‌ డేటా అభ్యర్ధులకు ఎప్పుడూ అందుబాటులోనే వుంటుందని,అలాగే పౌరులకు ఓటర్‌ టర్నవుట్‌ యాప్‌ ద్వారా నిరంతరం అందుబాటులో వుంటుందని తెలిపింది.

సాధారణంగా నూటికి నూరు శాతం పోలింగ్‌ నమోదు కావడం గొప్ప విశేషం. పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో నూరు శాతానికి మించి ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం గణాంకాల్లోనే పేర్కొనడంతో సర్వత్రా విస్మయానికి గురి చేసింది.  ఇసి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ మేరకు ఇసిని ఆదేశించాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

అయితే సార్వత్రిక ఎన్నికలు కీలక దశలో ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలైన ఓట్ల వివరాలను బహిరంగంగా విడుదల చేయాలంటూ ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు శుక్రవారం ఎడిఆర్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ వెంటనే శనివారం ఇసి ఈ డేటాను విడుదల చేయడం విశేషం.

ఫారమ్‌ 17సి ప్రాముఖ్యత
పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన సమాచారానికి సంబంధించి ఫారమ్‌ 17సి చాలా కీలకమైనది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ (ఇవిఎం)లో నమోదైన ఓట్ల రికార్డును ఫారమ్‌ 17సిలోనే పొందుపరుస్తారు. ఈ డేటాను తక్షణమే విడుదల చేయాలనే ఎడిఆర్‌ సుప్రీంను కోరింది. మొదటి రెండు దశల పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈ డేటాను ప్రచురించడంలో జాప్యం జరగడంతో ఈ పిటిషన్‌ దాఖలైంది. 

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి దశ పోలింగ్‌ తర్వాత అన్ని పోలింగ్‌ కేంద్రాల ఫారమ్‌ 17సి స్కాన్‌ చేసిన స్పష్టమైన కాపీలను ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా ఓటర్‌ టర్నవుట్‌కు సంబంధించిన విశ్వసనీయమైన రికార్డులను ఇసి వెల్లడించాలని ఎడిఆర్‌ విన్నవించింది. 

అయితే, ఫారమ్‌17సిని ప్రచురించేందుకు ఎలాంటి చట్టబద్ధమైన ఆదేశాలు లేవని బుధవారం ఇసి కోర్టుకు తెలియచేసింది. ఆ పత్రాన్ని కేవలం అభ్యర్ధులకు లేదా వారి ఏజెంట్లకు మాత్రమే ఇవ్వగలమని తెలిపింది. కాగా ఓటర్‌ టర్నవుట్‌ డేటా విడుదల చేసే ప్రక్రియపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన తీర్పుపై తాము మరింత బలోపేతమైనట్లు ఎన్నికల కమిషన్‌ శనివారం అభిప్రాయపడింది.