రామనవమికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సులభంగా రామ్‌లల్లా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. 19వ తేదీ వరకు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.శ్రీరామ నవమి రోజున రామ్‌లల్లా దర్శన సమయాలు మారుతాయన్నారు.
బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారు జామున 3.30 గంటల నుంచి మంగళ హారతి, అభిషేకం, అలంకరణ, దర్శనాలు ఉంటాయన్నారు. ఉదయం 5.00 గంటలకు శృంగార్ హారతి ఉంటుందని పేర్కొన్నారు. దర్శనాలు, పూజా కార్యక్రమాలు ఏకకాలంలో కొనసాగుతాయని.. నైవేద్యం సమర్పించే సమయంలో కొద్దిసేపు దర్శనాలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. రాత్రి 11 గంటల వరకు దర్శనాలు ఉంటాయని.. పరిస్థితులకు అనుగుణంగా భోగ్, శయన హారతి ఉంటుందని చెప్పారు.
More Stories
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష
శ్రీహరికోటలో మూడవ లాంచ్‌ప్యాడ్