సువిధ పోర్టల్ లో మూడొంతుల దరఖాస్తుల పరిష్కారం

ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేసేందుకు ప్రజలు, పార్టీల నుంచి క్రమబద్దమైన ఎన్నికల ప్రచారాన్ని స్వీకరించేందుకు ఈసీ అందుబాటులోకి తెచ్చిన సువిధ పోర్టల్‌లో రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుండి ఇప్పటి వరకు 73,379 అనుమతి అభ్యర్థనలు, దరఖాస్తులు అందినట్టు ఎన్నికల కమిషన్ ఏపీ సీఈఓ ఎం కె మీనా ప్రకటించారు. వాటిలో 44,626 అభ్యర్థనల్ని (60%) పరిష్కరించారు.

2024  ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి సువిధ పోర్టల్‌లో నమోదైన 73,000 దరఖాస్తుల్లో 44,600 కంటే ఎక్కువ ఫిర్యాదులు పరిష్కరించినట్టు ప్రకటించారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ సూత్రం ప్రాతిపదికన వచ్చిన ఫిర్యాదుల్ని వచ్చినట్టు పరిష్కరిస్తున్నారు. సువిధ పోర్టల్‌లో నమోదైైన ఫిర్యాదుల్లో 10,819 దరఖాస్తులు చెల్లనివిగా పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేని వాటిని కూడా పక్కన పెట్టారు.

ఇప్పటి వరకూ ఈసీకి అందిన ఫిర్యాదుల్లో గరిష్టంగా తమిళనాడు నుంచి 23,239 తర్వాత పశ్చిమ బెంగాల్ నుండి 11,976, మధ్యప్రదేశ్ నుండి 10,636 అభ్యర్థనలు అందాయి. చండీగఢ్ (17), లక్షద్వీప్ (18), మణిపూర్ (20) ల నుంచి కనిష్టంగా దరఖాస్తులు అందాయి. సువిధ పోర్టల్ ఉచిత, న్యాయమైన,  పారదర్శకమైన ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుండి అనుమతి అభ్యర్థనలు స్వీకరించేందుకు, వెంటనే వాటిపై తగు చర్యలు తీసుకునేందుకు భారత ఎన్నికల సంఘం చేత అభివృద్ధి చేయబడిన అత్యద్భుత సాంకేతిక పరిష్కారమని సీఈఓ మీనా తెలిపారు.

ఎన్నికల ప్రచార కాలంలో పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లకు చేరువయ్యే కార్యక్రమాలలో పాల్గొనేందుకు అయా కార్యక్రమాల అనుమతుల కోసం అభ్యర్థనలను ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సూత్రంపై పారదర్శకంగా అందించేందుకు సువిధ పోర్టల్ వీలు కల్పిస్తుంది. అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించడం, తాత్కాలిక పార్టీ కార్యాలయాలు తెరవడం, ఇంటింటికి ప్రచారం చేయడం, వీడియో వ్యాన్లు, హెలికాప్టర్లు, వాహన అనుమతులు పొందడం, కరపత్రాలు పంపిణీ చేయడం వంటి అనుమతులను అందిస్తుందని వివరించారు.

ఎన్నికల కమిషన్ ఐటి ఎకోసిస్టమ్‌కు క్లిష్టమైన అప్లికేషన్ సువిధ పోర్టల్ సువిధ పోర్టల్ https://suvidha.eci.gov.in ద్వారా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎక్కడనుంచైనా, ఎప్పుడైనా అనుమతి అభ్యర్థనలను ఆన్‌లైన్‌లో సజావుగా సమర్పించవచ్చని చెప్పారు. అదే సమయంలో ఆఫ్ లైన్ లో అభ్యర్థనలు సమర్పించే అవకాశాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.