ఫోర్స్బ్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో 200 మంది భారతీయులు

* టాప్‌-10లో ముఖేష్ అంబానీ

ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో 200 మంది భారతీయులకు చోటు దక్కింది. గతేడాది ఈ సంఖ్య 169 మంది భారతీయుల పేర్లున్న విషయం తెలిసిందే. నివేదిక ప్రకారం భారత బిలియనీర్ల మొత్తం సంపద 954 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది 675 బిలియన్ డాలర్లుగా ఉండగా, దాదాపు 41 శాతం పెరిగింది. 
 
దేశంలోని అగ్ర బిలియనీర్లుగా నిలిచిన వ్యక్తుల సంపదలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ 116 బిలియన్ డాలర్ల నికర సంపదతో జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.  84 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. తర్వాత స్థానంలో 36.9 డాలర్లతో శివ్‌నాడార్ ఉన్నారు. 
 
33.5 బిలియన్ డాలర్లు సావిత్రి జిందాల్‌ ఉన్నారు. సావిత్రి జిందాల్ భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ కావడం విశేషం. 26.7 బిలియన్‌ డాలర్లతో దిలీప్ సంఘ్వీ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ప్రపంచ టాప్‌-10 సంపన్నుల జాబితాలో భారత్‌ నుంచి ఒక ముఖేష్‌ అంబానీ మాత్రమే ఉన్నారు. ప్రపంచంలో తొమ్మిదవ అత్యంత సంపన్నుడిగా అంబానీ నిలిచారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ మెుదటి స్థానంలో ఉన్నారు.రెండో స్థానంలో ఎలాన్ మస్క్, మూడో స్థానంలో జెఫ్ బెజోస్ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మార్క్ జుకర్‌బర్గ్, లారీ ఎలిసన్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, స్టీవ్ బాల్మెర్, ముఖేష్ అంబానీ, లారీ పేజ్ ఉన్నారు. 

తాజాగా ప్రపంచ కుబేరుల జాబితాలో కొత్తగా 25 మంది భారతీయులకు చోటు దక్కింది. నరేష్ ట్రెహాన్, రమేశ్‌ కున్హికన్నన్, రేణుకా జగ్తియాని చోటుదక్కించుకోగా.. జైజు రవీంద్రన్‌, రోహికా మిస్త్రీ చోటు కోల్పోయారు.

భారతదేశంలోని 10 మంది ధనవంతులు వీరే

ముఖేష్ అంబానీ- నికర విలువ 116 బిలియన్ డాలర్లు
గౌతమ్ అదానీ- నికర విలువ 84 బిలియన్ డాలర్లు
శివ్ నాడార్- నికర విలువ 36.9 బిలియన్ డాలర్లు
సావిత్రి జిందాల్- నికర విలువ 33.5 బిలియన్‌ డాలర్లు
దిలీప్ షాంఘ్వీ- నికర విలువ 26.7 బిలియన్ డాలర్లు
సైరస్ పూనావాలా – నికర విలువ 21.3 బిలియన్‌ డాలర్లు
కుశాల్ పాల్ సింగ్- నికర విలువ 20.9 బిలియన్ డాలర్లు
కుమార మంగళం బిర్లా – నికర విలువ 19.7 బిలియన్లు
రాధాకిషన్ దమానీ- నికర విలువ 17.6 బిలియన్ డాలర్లు
లక్ష్మి మిట్టల్- నికర విలువ 16.4 బిలియన్ డాలర్లు