క్యాన్సర్‌ థెరపీని ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రమైన వ్యాధుల్లో క్యాన్సర్‌ ఒకటి. ఏటా క్యాన్సర్‌ ముప్పు పెరుగుతున్నది. దాంతో మరణాలు సైతం భారీగానే నమోదవుతున్నాయి. కార్యక్రమంలో ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, సకాలంలో క్యాన్సర్‌ను గుర్తించి చికిత్స అందించకపోవడమే మరణాలకు ప్రధాన కారణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 
 
మన దేశంలోనూ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతున్నది. భారత్‌లోనూ చాలామందిలో క్యాన్స్‌ చివరి స్టేజ్‌లోనే నిర్ధారణ అవుతున్నది.  ఈ క్రమంలో రోగులకు చికిత్స చేసి ప్రాణాలను కాపాడడం కష్టంగా మారుతున్నది. అయితే, బాంబే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) సరికొత్త చికిత్స విధానాన్ని పరిచయం చేసింది. 
 
క్యాన్సర్‌ చికిత్స కోసం దేశీయంగా కార్‌ టీ సెల్‌ థెరపీని తీసుకురాగా పోవైలో ఏర్పాటు కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఐఐటీ బాంబే, టాటా మెమోరియల్‌ సెంటర్‌ అభివృద్ధి చేసిన ఈ జన్యు ఆధారిత చికిత్స విధానం పలు రకాల క్యాన్సర్‌లను నయం చేయడంలో సహాయపడనున్నది.ది లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం  2019లో భారత్‌లో దాదాపు 12లక్షల కొత్త క్యాన్స్‌ కేసులుండగా, 9.3లక్షల మరణాలు రికార్డయ్యాయి. కార్‌ టీ సెల్‌ థెరపీ క్యాన్సర్ చికిత్సలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 నెక్స్‌ కార్‌19 కార్‌ టీ సెల్‌ థెరపీని భారత్‌ తొలి కార్ట్‌ టీ సెల్ థెరపీ కాగా, ఇది చికిత్స ఖర్చును గణనీయంగా తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. ఈ కొత్త థెరపీ సహాయంతో క్యాన్సర్ చికిత్స మరింత సులభతరం అవుతుందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.