
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని, అయితే ఈ నాలుగు జిల్లాల్లో ఒక ఉగ్రవాద సంస్థ క్రియాశీలకంగా ఉందని ఇటీవల అస్సాం పోలీసులు ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ఈ నాలుగు జిల్లాలను ‘కల్లోలిత ప్రాంతాలకు’గా గుర్తించి మరో ఆరు నెలల పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని రాష్ట్ర హోంశాఖ, కేంద్ర హోంశాఖను కోరినట్లు సంబంధిత అధికారి తెలిపారు.
దీంతో రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఈ చట్టం అమలులో ఉంటుందని తెలిపారు. 1990 నవంబర్‌లో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం అస్సాం రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్ర కటిస్తూ ఎఎఫ్‌ఎస్‌పిఎ చట్టం విధించింది. అప్పటి నుండి వరుసగా ఆరు నెలలు పొడిగిస్తూ వచ్చింది. 2022 ఏప్రిల్ 1న తొమ్మిది జిల్లాలు, కాచర్ జిల్లాలో కొంత భాగాన్ని మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ఈ చట్టాన్ని ఉపసంహరించింది. ఇటీవల జోర్హాట్, గోల్‌ఘాట్, కర్బి, అంగ్లాంగ్, డిమాహసావో జిల్లాల నుండి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుంది.
More Stories
ఢిల్లీలో బిజెపి సునామి.. యాక్సిస్ మై ఇండియా అంచనా
2027లో చంద్రయాన్-4 మిషన్ ప్రయోగం
ఛత్తీస్గడ్లో మరో నలుగురు మావోలు మృతి