టీ20ల్లో వంద అర్ధ శ‌త‌కాలతో కోహ్లీ మరో రికార్డు

భార‌త స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ మ‌రో ఘ‌న‌త సాధించాడు. వ‌న్డేల్లో 50 సెంచ‌రీలతో రికార్డు నెల‌కొల్పిన విరాట్ తాజాగా టీ20ల్లో వంద అర్ధ శ‌త‌కాలతో మరో రికార్డు సృష్టించాడు. దాంతో, ఈ రికార్డుకు చేరువైన‌ తొలి టీమిండియా ఆట‌గాడిగా విరాట్ చ‌రిత్ర సృష్టించాడు. 

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌పై కోహ్లీ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. దాంతో, పొట్టి ఫార్మాట్‌లో వంద అర్ధ శ‌త‌కాల మైలురాయికి చేరుకున్నాడు.  ఇప్ప‌టివ‌ర‌కూ పొట్టి క్రికెట్‌లో ముగ్గురు మాత్ర‌మే 100 హాఫ్ సెంచ‌రీలు బాదారు.  వెస్టిండీస్ మాజీ విధ్వంస‌క ఓపెన‌ర్ క్రిస్ గేల్, ఆస్ట్రేలియా చిచ్చ‌ర‌పిడుగు డేవిడ్ వార్న‌ర్ లు కోహ్లీ కంటే ముందున్నారు. గేల్ సాధించ‌గా 110 ఫిఫ్టీలు బాద‌గా, డేవిడ్ భాయ్ 109 హాఫ్ సెంచ‌రీలు కొట్టాడు.

రెండో బంతికే బెయిర్‌స్టో క్యాచ్ నేల‌పాలు చేయ‌డంతో బ‌తికిపోయిన విరాట్ ఓ రేంజ్‌లో ఆడాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ సాధించాడు. హ‌ర్ష‌ల్ ప‌టేల్ ఓవ‌ర్‌లో రెండు ఫోర్లు బాదిన కోహ్లీ ఆ తర్వాత బౌండ‌రీ వ‌ద్ద హ‌ర్‌ప్రీత్ బ్రార్‌కు క్యాచ్ ఇచ్చాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో కోహ్లీపై వేటు ప‌డ‌నుంద‌నే వార్త‌ల‌కు త‌న‌ సూపర్ ఇన్నింగ్స్‌తో కోహ్లీ కౌంట‌ర్ ఇచ్చాడు. 

త‌న‌లో ఇంకా చేవ త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తూ విధ్వంస‌క హాఫ్ సెంచ‌రీ బాదాడు. అత‌డు ఔట‌య్యాక దినేశ్ కార్తిక్(28 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయ‌ర్ అభిషేక్ లొమ్‌రోర్‌ (17 నాటౌట్)లు చివ‌రిదాకా నిల‌బ‌డి జ‌ట్టును గెలిపించారు. దాంతో, ఆర్సీబీ 17వ సీజ‌న్‌లో బోణీ కొట్టింది.

టీ20ల్లో అత్య‌ధిక క్యాచ్‌ల‌తో కోహ్లీ మ‌రో రికార్డు నెల‌కొల్పాడు. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగ‌ని మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు ప‌ట్టిన విరాట్. 173 క్యాచ్‌లతో సురేశ్ రైనా రికార్డును బ్రేక్ చేశాడు. రోహిత్ శ‌ర్మ 167, మ‌నీశ్ పాండే 146, సూర్య‌కుమార్ యాద‌వ్ 136 క్యాచ్‌లు ప‌ట్టారు. పంబాజ్‌పై విజ‌యం అనంత‌రం కోహ్లీ ఉత్సాహంగా డాన్స్ చేశాడు. ఆ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.