కవితకు రెండు వారాల రిమాండ్… తీహార్ జైలుకు తరలింపు

ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితకు రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు.ఏప్రిల్ 9వ తేదీ వరకు కవితకు రిమాండ్ విధించారు. ఈడీ కస్టడీ ముగియడంతో కవితను మంగళవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఇవాళ 10 రోజుల కస్టడీ ముగియటంతో ఈడీ అధికారులు ఆమెను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.
ఈడీ తరఫు న్యాయవాది జోయబ్‌ హుస్సేన్‌ ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించారు. 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి పంపాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు కోర్టుకు వెల్లడించారు. కవిత విచారణకు సహకరించడం లేదని, మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకువెళ్లారు. కేజ్రీవాల్, కవితను కలిపి విచారించాల్సిన అవసరం ఉందని, అందుకే మరో వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది.
కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్‌ విడుదల అయ్యిందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్డడీ విధించింది.  ఏఫ్రిల్ 9 వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు. ఈ మేరకు కవితను జైలుకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 1న విచారణ చెపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.

 మరోవైపు ఈడీ విచారణలో పలు విషయాలు వెలుగు చూశాయి. కవిత మేనల్లుడి ద్వారా నిధులను మళ్లించారనే ఈడీ దర్యాప్తులో కనుగొన్నట్టు చెబుతున్నారు. కాగా, తనపై మోపిన కేసు మనీ లాండరింగ్ కేసు కాదని, కేవలం పొలిటికల్ లాండరింగ్ కేసని కవిత కోర్టు వద్ద ఆరోపించారు. తెలంగాణ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను మార్చి 15న హైదరాబాద్ లో అరెస్టు చేసి, మరుసటి రోజే ఈడీ కస్టడీకి అప్పగించారు. అదే రోజు హైదరాబాద్ లోని కవిత నివాసంలో సోదాలు నిర్వహించి ఆమెను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు