చెన్నై సౌత్ నుంచి మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై పోటీ

లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ మూడో జాబితా విడుద‌ల చేసింది. త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన 9 మంది అభ్య‌ర్థుల‌తో కూడిన జాబితాను గురువారం సాయంత్రం ఆ పార్టీ అధికారికంగా విడుద‌ల చేసింది. తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ చెన్నై సౌత్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగ‌నున్న‌ట్లు జాబితాలో పేర్కొన్నారు.
 
 కోయంబ‌త్తూరు నుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామ‌లై, క‌న్యాకుమారి నుంచి రాధాకృష్ణ‌న్, చెన్నై సెంట్ర‌ల్ నుంచి వినోజ్ పీ సెల్వం, వెల్లూరు నుంచి డాక్ట‌ర్ ఏసీ ష‌ణ్ముఘం, కృష్ణ‌గిరి నుంచి సీ న‌ర‌సింహా, నీల‌గిరి నుండి కేంద్ర మంత్రి డాక్ట‌ర్ ఎల్ మురుగ‌న్, పెరంబ‌లూరు నుంచి టీఆర్ ప‌ర్వేంధ‌ర్, తూత్తూకుడి నుంచి నైనార్ న‌రేంద్ర‌న్ పోటీ చేయ‌నున్నారు.
 
కాగా, బీజేపీ తన మొదటి జాబితాలో 194 మంది అభ్యర్థుల స్థానాలను ఖరారు చేయగా.. రెండో జాబితాలో 72 మంది పేర్లను ప్రకటించారు. ఇప్పుడు మూడో జాబితాగా 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ జాబితాలో తమిళనాడు రాష్ట్ర అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది బీజేపీ. మొత్తంగా ఇప్పటి వరకు 275 మంది పేర్లను బీజేపీ ఖరారు చేసింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370, ఎన్డీయే కూటమి 400 స్థానాలకు పైగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.