దేవి అహల్యాబాయి 300వ జయంతి వేడుకల్లో పాల్గొనండి

ఈ ఏడాది మే 31 నుండి ప్రారంభమయ్యే పుణ్య శ్లోక్ దేవి అహల్యాబాయి 300వ జన్మదినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాలలో స్వయంసేవకులందరూ మనస్ఫూర్తిగా పాల్గొనాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవహ్ దత్తాత్రేయ హోసబలే పిలుపిచ్చారు. 
 
తద్వారా ఆమె చూపిన సరళత్వం, శీలం, మతతత్వం, జాతీయ ఆత్మగౌరవం బాటలో అగ్రగామిగా నిలవడమే ఆమెకు నిజమైన నివాళి కాగలదని నాగపూర్ లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో చెప్పారు. ఈ సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ఆయన ఘనంగా నివాళులు అర్పించారు:
 

ఒక సాధారణ నేపథ్యం ఉన్న పల్లెటూరి అమ్మాయి నుండి అసాధారణమైన పాలకురాలిగా ఆమె చేసిన జీవిత ప్రయాణం నేటికీ గొప్ప స్ఫూర్తిదాయకం. కర్తవ్యం, సరళత, ధర్మం పట్ల నిబద్ధత, పరిపాలనా దృక్పథం, దూరదృష్, అద్భుతమైన పవిత్రతకు ఆమె ఒక ప్రత్యేక ఉదాహరణ.

 
ఆమె “శంకర్ అజ్నేవరుణ్” (శ్రీ శంకర్ ఆదేశాల ప్రకారం) రాజముద్రతో భగవాన్ శంకర్ ప్రతినిధిగా పరిపాలించింది. భూమిలేని రైతులు, భిల్లుల వంటి గిరిజన సమూహాలు, వితంతువుల ప్రయోజనాలను పరిరక్షించే ప్రజా సంక్షేమ ఆధారిత కార్యక్రమాలతో ఆమె పాలన ఆదర్శంగా నిలిచింది. సమర్ధవంతమైన పాలకురాలిగా, దేవి అహల్యాబాయి సామాజిక పరివర్తన, వ్యవసాయాభివృద్ధి, నీటి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజల సంక్షేమం, విద్యకు కట్టుబడి పరిపాలన కావించారు.  అన్నింటికీ మించి న్యాయానికి కూడా అంకితమయ్యారు.
 
ఆమె పరిపాలన పునాది సమాజంలోని అన్ని వర్గాలకు గౌరవం, భద్రత, అభివృద్ధిని అందించే సామరస్య ఆధారిత దృష్టిని కలిగి ఉంది. ఆమె తన రాజ్యంపై మాత్రమే కాకుండా, మొత్తం దేశంలోని దేవాలయాల పూజలు, ఆర్థిక నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. బద్రీనాథ్ నుండి రామేశ్వరం, ద్వారక నుండి పూరి వరకు ఆక్రమణదారులచే అపవిత్రం చేయబడిన ఆలయాలను ఆమె పునరుద్ధరించారు.
 
పురాతన కాలం నుండి కొనసాగిన తీర్థయాత్రలు, దండయాత్రల సమయంలో విఘాతం ఆమె కృషి వల్ల కొత్త జీవం పోసింది. ఈ గొప్ప ప్రయత్నాల కారణంగా ఆమెకు “పుణ్య శ్లోక్” అనే బిరుదు వచ్చింది. భారతదేశం అంతటా విస్తరించి ఉన్న ఈ పుణ్యక్షేత్రాల అభివృద్ధి ఆమె జాతీయ దృక్పధానికి ప్రతిబింబం.