చైల్డ్ పోర్న్ కేసులో హైకోర్టు తీర్పును `సుప్రీం’ సమీక్ష

చైల్డ్ పోర్న్‌కు సంబంధించిన వీడియోల‌ను డౌన్‌లోడ్ చేయడం కానీ, వాటిని వీక్షించ‌డం కానీ పోక్సో చ‌ట్టం, ఐటీ చ‌ట్టం కింద నేరం కాదు అని ఇటీవ‌ల మ‌ద్రాసు హైకోర్టు పేర్కొన్న‌ది. ఆ తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీష‌న్ వేశారు. ఇలాంటి పిల్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించ‌డం దారుణ‌మే అవుతుంద‌ని సుప్రీంకోర్టు తెలిపింది. 
 
త‌న మొబైల్ ఫోన్‌లో చైల్డ్ పోర్న్‌కు చెందిన వీడియోల‌ను డౌన్‌లోడ్ చేసిన కేసులో 28 ఏళ్ల వ్య‌క్తిపై నేరాభియోగాలు న‌మోదు అయ్యాయి. అయితే ఆ అభియోగాల‌ను జ‌న‌వ‌రి 11వ తేదీన చెన్నై హైకోర్టు కొట్టిపారేసింది. దీనిపై ఇప్పుడు సుప్రీం విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ది. జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ జేబీ ప‌ర్దివాలా, మ‌నోజ్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారిస్తున్న‌ది. సీనియ‌ర్ న్యాయ‌వాది హెచ్ఎస్ ఫూల్కా ఈ కేసులో పిటీష‌న్ స‌మ‌ర్పించారు.
జ‌స్ట్ రైట్స్ ఫ‌ర్ చిల్డ్ర‌న్ అలియ‌న్స్‌, బ‌చ్‌ప‌న్ బ‌చావో ఆందోళ‌న్ సంస్థ‌ల త‌ర‌పున కూడా ఓ సీనియ‌ర్ న్యాయ‌వాది వాదించారు. ఈ కేసులో చెన్నైకి చెందిన హ‌రీశ్‌, ఇద్ద‌రు పోలీసు ఆఫీస‌ర్ల నుంచి రెస్పాన్స్ కోరింది. పోక్సో చ‌ట్టం 2012, ఐటీ చ‌ట్టం 2000 కింద హ‌రీశ్ కేసును కొట్టివేస్తున్న‌ట్లు చెన్నై హైకోర్టు తెలిపింది. ఐటీ చ‌ట్టంలోని 67-బీ కింద నేరం ర‌జువు కావాలంటే నిందితుడు ఆ కాంటెంట్‌ను ప‌బ్లిష్ చేయ‌డం కానీ, ట్రాన్స్‌మిట్ చేయం కానీ, పిల్ల‌ల‌తో కొత్త వీడియోల‌ను చేయ‌డం కానీ ఉండాల‌ని పేర్కొన్న‌ది. అందుకే కేవ‌లం చైల్డ్ పోర్న్‌ను వీక్షించ‌డం సెక్ష‌న్ 67-బీ కింద నేరం కాదు అని హైకోర్టు తెల‌పింది. మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసిన రెండు మైన‌ర్ పిల్ల‌ల వీడియోల‌ను ఎవ‌రికీ ట్రాన్స్‌మిట్ చేయ‌లేద‌ని హైకోర్టు తెలిపింది.