సీఏఏ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. తాజాగా అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక పోర్టల్‌ను ప్రారంభించింది . భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా https://indiancitizenshiponline.nic.in వెబ్ పోర్టల్‌ను మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు CAA-2019 పేరుతో మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘానిస్థాన్‌ దేశాల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పిండచం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఆ దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతరుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం భారత పౌరసత్వాన్ని కల్పించనున్నారు.  అయితే, 2014 డిసెంబర్‌ 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులైన హిందువులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు, సిక్కులకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. ఈ దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్ లైన్ ద్వారానే జరుగుతుంది.

ఈ చట్టం కింద పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?

  • ముందుగా కేంద్రం అందుబాటులోకి తెచ్చిన https://indiancitizenshiponline.nic.in వెబ్‌ పోర్టల్‌లోకి వెళ్లాలి.
  • ‘సీఏఏ, 2019 కింద భారత పౌరసత్వం కోసం అప్లికేషన్‌ సబ్మిట్‌’ అనే బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఆ తర్వాత మొబైల్‌ నంబర్‌, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేని కంటిన్యూ బటన్‌పై క్లిక్‌ చేస్తే నెక్ట్స్‌ పేజ్‌ ఓపెన్‌ అవుతుంది.
  • అక్కడ పేరు, ఈ మెయిల్‌ ఐడీ ఇతర వివరాలను నమోదు చేసి సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.
  • వివరాలన్నీ నమోదు చేసి సరిచూసుకున్న తర్వాత సబ్మిట్‌ బటన్‌ క్లిక్‌ చేస్తే.. మీ ఈ మెయిల్‌, మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీని వెరిఫై చేసిన తర్వాత అదనపు వెరిఫికేషన్‌ కోసం క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.
  • వెరిఫికేషన్‌ పూర్తయ్యాక మీ పేరుతో లాగిన్‌ అయి న్యూ ఫామ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  • అక్కడ మీ బ్యాక్‌గ్రౌండ్‌, ఏ దేశానికి (పాకిస్థాన్‌, ఆఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌) చెందిన వారు, భారత్‌కు ఎప్పుడు వచ్చారు..? వంటి ప్రశ్నలకు సమాధానాలతో దరఖాస్తును నింపాల్సి ఉంటుంది.