హైతీలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

హైతీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. రాత్రివేళల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. గత శనివారం దేశ రాజధానిలోని ప్రధాన జైలుపై దుండగుల ముఠా దాడిలో వేలాది మంది ఖైదీలు పరారయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

అత్యవసర పరిస్థితితో పాటు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మార్చి 3 నుండి బుధవారం వరకు కర్ఫ్యూ పరిస్థితులు కొనసాగనున్నాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఆ హింస‌లో క‌నీసం 12 మంది మ‌ర‌ణించారు. ప్ర‌భుత్వ వ‌ర్గాల ప్ర‌కారం సుమారు నాలుగు వేల మంది ఖైదీలు ప‌రారీ అయిన‌ట్లు తెలుస్తోంది. రాజ‌ధానితో పాటు స‌మీపంలోని క్రాక్స్ డీ బోకేలో ఉన్న రెండు జైళ్ల‌పై సాయుధ‌లు దాడి చేశారు. పరిస్థితుల పునరుద్ధరణలో భాగంగా రాజధాని పోర్ట్‌ ఔ ప్రిన్స్‌ ఉన్న క్వెస్ట్‌ రీజియన్‌లో ఈ రెండు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

దేశ తాత్కాలిక ప్రధానిగా వ్యవహరిస్తున్న ఆర్థిక మంత్రి పాట్రిక్‌ మిచెల్‌ బయిస్వర్ట్‌ ఈ ఉత్తర్వులపై సంతకం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హైతీ  ప్రధాని ఏరియల్‌ హెన్రీ గత వారం కెన్యాకు వెళ్లారు.  హైతీలో దుండగుల ముఠాలను అడ్డుకునేందుకు సాయుధ దళాలను మోహరించేందుకు ఈ ఒప్పందం అనుమతించనుంది. 

ప్ర‌ధాని ఏరియ‌ల్ హెన్రీ రాజీనామా చేయాల‌ని సాయుధ ద‌ళాలు డిమాండ్ చేస్తున్నాయి. పోర్ట్ ఆవ్ ప్రిన్స్‌లో 80 శాతం ఆ గ్యాంగ్‌ల ఆధీనంలోనే ఉంటుంది. 2020 నుంచి జ‌రిగిన ముఠా హింస వ‌ల్ల వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌వించాయి.