గోధ్రాలో హిందువుల సజీవ దహనం .. అసలేం జరిగింది?

 
* 2002 నాటి గుజరాత్ అల్లర్లను ప్రేరేపించిన గోధ్రా మారణకాండ జరిగిన రోజు
 
2002లో కలకలం రేపిన గుజరాత్ అల్లర్లపై దర్యాప్తు జరిపిన నానావతి మెహతా కమిషన్ నివేదికను ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత డిసెంబర్ 11, 2009న
ఆ రాష్ట్ర  హోంశాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింహ్ జడేజా రాష్ట్ర అసెంబ్లీలో ఉంచారు.  2002లోనే గుజరాత్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఆ  తరువాత సుప్రీంకోర్టు ఆ కమిటీని పునర్నిర్మించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి టి నానావతి ఛైర్మన్‌గా, గుజరాత్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కె జి షా సభ్యునిగా నియమించింది. 
 
జస్టిస్ షా మరణానంతరం ఆయన స్థానంలో జస్టిస్ అక్షయ్ మెహతా బాధ్యతలు చేపట్టారు. కమిషన్ నిబంధనలను కూడా విచారించకుండా విస్తరించారు. ఆ తర్వాత ఆ కమిషన్ పరిధిని కూడా విస్తరించారు. గోధ్రా రైలు దహనంతో పాటు ఆ తర్వాత జరిగిన హింస, మత కల్లోలాలు, అల్లర్లలో నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రులు, పోలీస్ అధికారుల పాత్రపై కూడా దర్యాప్తును జత చేశారు.
 
1,000 మందికి పైగా ప్రాణాలు తీసిన అల్లర్ల తరువాత, భారతీయ మేధావిలో చాలామంది  వర్గం ఇందులో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భాగస్వామిగా ఉందని నిందించారు. నాటి సంఘటనలను మతపరమైన అల్లర్లకు బదులుగా “జాతి ప్రక్షాళన”, “రాజ్య ఉగ్రవాదం”,  ముస్లింలపై “విధ్వంసం”గా అభివర్ణించారు.
 
అయితే, నానావతి-మెహతా కమిషన్ నాటి హింసలో అప్పటి రాష్త్ర ప్రభుత్వం, మంత్రులు, పోలీసు అధికారులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యులని వాదనలను కొట్టిపారేసింది. పైగా, ఈ హింసాకాండ వెనుక `ముందస్తు ప్రణాళిక- కుట్ర’ ఉండనే వాదనను కూడా తోసిపారవేసింది.  మూడు సంపుటాలుగా సమర్పించిన 1,500 పేజీల నివేదికలో రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ మంత్రి అయినా పాత్ర వహించడం ద్వారా “ఈ దాడులు ప్రేరేపించబడినవి లేదా పథకం ప్రకారం జరిగినవి” అని చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
 
రాష్ట్రంలో హింసకు దారితీసిన గోధ్రా రైలు దగ్ధం ఒక ప్రమాదమా లేక ముందస్తు ప్రణాళిక ప్రకారం ముస్లింలపై హింసను రెచ్చగొట్టేందుకు పధకం ప్రకారం చేసిందా? అంటూ వామపక్ష మేధావులు చేస్తున్న ఆరోపణలను సహితం కమిషన్ తిరస్కరించింది. గుజరాత్ లో చెలరేగిన అల్లర్లకు గోధ్రా ఘటనే కారణమని స్పష్టం చేసింది.
“మాకు అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్ని పరిశీలిస్తే గోధ్రా ఘటన తర్వాత జరిగిన అల్లర్లు ఆ ఘటన అనంతర పరిణామాలే అని స్పష్టం అవుతుంది” అని నివేదిక తేల్చి చెప్పింది. “గోధ్రా ఘటన కారణంగా చాలామంది హిందువులు ఆగ్రహం చెందారు. చివరకు ముస్లింలు, వారి ఆస్తులపై హింసాత్మక దాడులకు పాల్పడ్డారు” అని తెలిపింది.
 
అయోధ్యలో జరిగిన కరసేవలో పాల్గొని సబర్మతి ఎక్స్‌ప్రెస్ లో తిరిగి వస్తున్న హిందూ యాత్రికులు గల ఎస్-6 కోచ్ ను దగ్ధం చేయడంతో అందులోని 57 మంది ఫిబ్రవరి 27, 2002న సజీవ దహనం అయ్యారు. బాధితుల్లో 25 మంది మహిళలు, 25 మంది పిల్లలు, తొమ్మిది మంది పురుషులు ఉన్నారు. గోద్రా రైలు దహనం కేసును విచారించిన ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2011లో ఇచ్చిన తీర్పులో ఎస్-6 కోచ్‌లో అగ్ని ప్రమాదం జరగలేదని, రైలులో ప్రయాణిస్తున్న వారి దుశ్చర్య కాదని నిర్ధారణకు వచ్చింది.
 
ముందు రోజు రాత్రే పెట్రోల్ ను సిద్ధంగా ఉంచుకొనని పక్షంలో 5- 10 నిముషాలలో ఘటన జరిగిన ప్రదేశంకు చేరుకోవడం సాధ్యం కాదన్న   ప్రాసిక్యూషన్ వాదనతో  కోర్టు అంగీకరించింది. హిందూ యాత్రికులను లక్ష్యంగా చేసుకోవడానికి ‘ముందస్తు ప్రణాళికాబద్ధమైన కుట్ర’ అని కోర్టు కనుగొంది. లేకుంటే భారీ సంఖ్యలో ముస్లింలను మారణాయుధాలతో రైల్వే ట్రాక్ పైకి సమీకరించడం అంత తక్కువ వ్యవధిలో సాధ్యం కాదని తెలిపింది. అందుకనే ఎస్-6 కోచ్ పై జరిగిన దాడి యాదృశ్చిక దాడి కాదని నిర్ధారణకు వచ్చింది.
 
అయోధ్య నుండి తిరిగి వస్తున్న కరసేవకులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారు. “దుండగులు నినాదాలు చేయడం, సమీపంలోని మసీదు నుండి లౌడ్ స్పీకర్‌లో ప్రకటించడం కూడా స్పష్టంగా ముందస్తు ప్రణాళికను సూచిస్తుంది” అని కోర్టు పేర్కొంది.  డిఫెన్స్ లాయర్ వాదిస్తూ దాడులు ముందస్తు ప్రణాళికతో జరిగినవి కావని, గోద్రా స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై కొందరు ముస్లింలతో కరసేవకుల “దుష్ప్రవర్తన”కి ఆకస్మిక ప్రతిస్పందన అని చెప్పారు. అయితే ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ప్లాట్‌ఫారమ్‌పై ఎలాంటి వాగ్వివాదాలు జరగలేదని స్పష్టం చేసింది.

 అలాగే, కరసేవకులు, ముస్లిం వ్యాపారుల మధ్య జరిగిన ఘర్షణలు జరిగినట్లు,  ముస్లిం మహిళల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు సహితం నిరాధారమని కోర్టు తెలిపింది. “పరారీలో ఉన్న నిందితుడు సలీం పన్వాలా, నిందితులు మెహబూబ్ అహ్మద్ అలియాస్ లాటికో కర్ ముస్లిం బాలికల పట్ల కరసేవకులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సమీపంలోని సిగ్నల్ ఫాలియా ప్రాంతానికి చెందిన ముస్లిం ప్రజలను పిలిచి కేకలు వేశారు. కరసేవకులు ముస్లిం బాలికను రైలు లోపలి నుండి అపహరిస్తున్నారని [వారిని] తప్పుదారి పట్టించారు. రైలును గొలుసు లాగడం ద్వారా రైలును ఆపమని సూచించారు” అని కోర్టు తెలిపింది. 

 
“వెంటనే 900 మందికి పైగా ముస్లింల గుంపు రైలుపై దాడి చేసింది. కర్రలు, ఇనుప పైపులు, ఇనుప కడ్డీలు, ధరియాలు, గుప్తీలు, యాసిడ్ బల్బులు, మండే గుడ్డలతో దాడి చేశారు. సమీపంలోని అలీ మసీద్ నుండి లౌడ్‌స్పీకర్‌లలో ప్రకటనలు చేయడంతో జనం రెచ్చిపోయారు. ఇంత ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం ద్వారా, ప్రయాణికులు రైలు నుండి దూకకుండా అడ్డుకున్నారు.” అని న్యాయమూర్తి గోధ్రా ఘటన వాస్తవాలను ఉదహరించారు. 
 
గోధ్రా పట్టణంలో హిందూ, ముస్లిం జనాభా దాదాపు సమానం అని, అక్కడ మతపరమైన అల్లర్లు జరగడం, అమాయక హిందువులను సజీవ దహనం కావించడం ఇదే మొదటి సంఘటన కాదని న్యాయమూర్హ్టి ఈ సందర్భంగా తెలిపారు. 1965 నుండి 1992 మధ్య గోద్రాలో జరిగిన హిందువుల సజీవ దహనం, దుకాణాలు- ఇళ్లను దగ్ధం చేయడం వంటి సుమారు 10 సంఘటనలను న్యాయమూర్తి ప్రస్తావించారు
(స్వరాజ్య సౌజన్యంతో)