ఆచార్య విద్యాసాగర్ జీ మనందరికీ మార్గదర్శకులు

 
* శివాజీ మహారాజ్ ఎప్పటికైనా స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం
 
అత్యంత కఠోరమైన ఉపవాసం, సంపూర్ణ పరిత్యాగాన్ని పాటించే ఆచార్య విద్యాసాగర్ జీ మనందరికీ మార్గదర్శకులు, పైగా దేశానికి గొప్ప ఆస్తి కూడా అంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ ఘనంగా నివాళులు అర్పించారు.  ఇటీవల పరమపదించిన ప్రముఖ జైనముని ఆచార్య విద్యాసాగర్  మహరాజ్ స్మారకార్థం ఆదివారం నాగపూర్ లో జరిగిన `గురు విన్యాంజలి’  నివాళి కార్యక్రమంలో జైన సంత్ సంఘ్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు.
 
ఆచార్య విద్యాసాగర్‌ ను మొదటిసారి కలుసుకుని చర్చించిన తర్వాత ఆయన తన ఘనత  దృష్టికి వచ్చిమదని, ఆయన తార్కికంగా మాట్లాడటమే కాకుండా ఆ తర్కిత వెనుక సహజమైన ఆత్మీయత కూడా ఉంటుందని డా. భగవత్ తెలిపారు. సాధువులు ప్రతి ఒక్కరినీ తమ వారిగా భావిస్తారని చెబుతూ మనం కూడా సాధువుల బోధనలను నమ్ముకుంటే తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పారు. 
 
ఆచార్య విద్యాసాగర్ లేకపోవడం తనకు వ్యక్తిగతంగా నష్టం అని పేర్కొంటూ ఆయనతో అరగంటసేపు కూర్చున్నప్పటికీ ఆ తర్వాత సంవత్సరం అంతా మన మనస్సు స్థిరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఆయన చూపిన బాటలో మనం ఎల్లవేళలా పయనిస్తే మనం ఎప్పటికీ పురోగమించవచ్చని భరోసా వ్యక్తం చేశారు. 
 
ఆచార్య విద్యాసాగర్ విలువైన మార్గదర్శకాలను గుర్తు చేసుకొంటూ ‘స్వయం’ నుండి ప్రారంభించండి, పురోగతి దాని ఆధారంగా మాత్రమే జరుగుతుందని చెప్పేవారని గుర్తు చేశారు. “నా దేశానికి `భారతదేశం’ చెప్పండి, `ఇండియా’ అని చెప్పకండి’ అంటూ ఎప్పుడూ స్పష్టం చేసేవారని తెలిపారు.  ప్రజలు దేశపు ఉత్పత్తిని పెంచితే వారికి ఉపాధి లభిస్తుందని, దేశానికి దేశానికి ప్రయోజనాలు లభిస్తాయని అంటూ ఈ విధంగా సమయానుకూలంగా మార్గదర్శకాలు చేసేవారని డా. భగవత్ గుర్తుచేసుకున్నారు. వ్యక్తిగత ప్రవర్తన లేదా దేశం గురించి ఆయఆ న మాటలు మనందరికీ మార్గదర్శకం అని స్పష్టం చేశారు. 
శివాజీ మహారాజ్ స్ఫూర్తిదాయకం
 
ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్ని కాలాలలోనూ స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం అని డా. మోహన్ భగవత్ తెలిపారు.  నాగ్‌పూర్‌లోని రేషింబాగ్‌లోని మహర్షి వ్యాస్ ఆడిటోరియంలో శివరాజ్యాభిషేక వేడుకల కమిటీ, శంకర్ నగర్; రాష్ట్ర సేవికా సమితి, ఉమా శాఖ జరిపిన  ‘స్వర్ జీజై’ సంగీత కార్యక్రమంలో పాల్గొంటూ ఈ సంవత్సరం ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు.
 
రామాయణం పాటలు పాడుతూ ఉండటం ద్వారా ప్రతి ఇంటికి శ్రీరాముడు చేరుకున్న విధంగా ఈ కార్యక్రమం ద్వారా ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ప్రతి ఇంటికి చేరుకున్నారని తెలిపారు. కానీ, కొత్త తరానికి చరిత్రను తెలియజేసేందుకు చాలా అనువైన కార్యక్రమాన్ని అందిస్తున్నారని ఆయన అభినందనలు తెలిపారు.
 
ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్ర అంతటా బాగా జరపాలని ఆయన సూచించారు.  ఛత్రపతి శివాజీ మహారాజ్, రాజమాత జీజాబాయి జీవిత సంఘటనల ఆధారంగా ఈ కార్యక్రమం ఉంటుంది. హిందీ, మరాఠీ పాటలను ప్రదర్శించారు. ఈ హిందీ పాటల్లో ఎక్కువ భాగం రాష్ట్ర సేవికా సమితి సహా కార్యవాహ
 సులభతై దేశ్‌పాండే రచించారు.