మార్చ్ 15 తర్వాత ఫాస్టాగ్ రీఛార్జ్‌లు చేసుకోవ‌ద్దు

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 29వ తేదీ నుంచి త‌మ అకౌంట్‌లోకి కొత్త డిపాజిట్ల‌ను తీసుకోరాదు అని పేటీఎంకు ఇటీవ‌ల ఆర్బీఐ ఆదేశించింది. అయితే ఆ డెడ్‌లైన్‌ను మార్చి 15వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. 
 
మార్చి 15వ తేదీ త‌ర్వాత పేటీఎం అకౌంట్‌లో డిపాజిట్ కానీ, క్రెడిట్ కానీ, టాప్ అప్ కానీ కుద‌ర‌ద‌ని తాజా స‌ర్క్యూల‌ర్‌లో ఆర్బీఐ పేర్కొన్న‌ది. ఫాస్టాగ్ రీఛార్జ్‌లు కూడా చేసుకోవ‌ద్దు అని ఆర్బీఐ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.  ప్ర‌స్తుతం పేటీఎం ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ ఉన్న‌వాళ్లు టోల్ ప్లాజాల వ‌ద్ద త‌మ అకౌంట్‌లో ఉన్న అమౌంట్‌ను వాడుకోవ‌చ్చు.
 
 కానీ మార్చి 15వ తేదీ త‌ర్వాత మాత్రం ఆ అకౌంట్‌లో ఎటువంటి టాప్ అప్‌ను అనుమ‌తించ‌రు. పేటీఎం ఫాస్టాగ్‌ను డీయాక్టివేట్ చేసుకునేందుకు 1800-120-4210 నెంబ‌ర్‌కు ఫోన్ చేసి మీ మొబైల్ నెంబ‌ర్‌, వెహికిల్ రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్ ఇవ్వాల్సి ఉంటుంది. పేటీఎం క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ ఏజెంట్ మీ ఫాస్టాగ్ క్లోజ‌ర్‌ను క‌న్ఫార్మ్ చేస్తారు. పేటీఎం యాప్ ద్వారా కూడా ఫాస్టాగ్‌ను డీయాక్టివేట్ చేసుకోవ‌చ్చు.ఆన్‌లైన్‌లో కొత్త‌గా ఫాస్టాగ్ కొనాల‌నుకునేవాళ్లు.. ముందుగా త‌మ ఫోన్‌లో మై ఫాస్టాగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత బ‌య్ ఫాస్టాగ్ లింక్‌ను క్లిక్ చేయాలి. ఫాస్టాగ్ కొన్న త‌ర్వాత అది మీ ఇంటి అడ్రెస్‌కు డెలివ‌రీ అవుతుంది. ఒక్క వాహ‌నానికి ఎక్కువ సంఖ్య‌లో ఫాస్టాగ్‌లను అనుమ‌తించ‌రు. లేటెస్ట్ ఫాస్టాగ్‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు. అది మాత్ర‌మే యాక్టివ్‌గా ఉంటుంది.