తొలిసారి ఫైనల్‌కు భారత మహిళల బ్యాడ్మింటన్‌ జట్టు

ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిల కొత్త చరిత్ర లిఖించారు. టోర్నీలో తొలిసారి ఫైనల్‌ పోరుకు అర్హత సాధించి ఔరా అనిపించారు. శనివారం జరిగిన సెమీస్‌లో మన అమ్మాయిల జట్టు 3-2తో రెండు సార్లు చాంపియన్‌ జపాన్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. 
 
సెమీస్‌ విషయానికొస్తే..తొలుత జరిగిన సింగిల్స్‌లో పీవీ సింధు 13-21, 20-22తో అయా ఒహోరీ చేతిలో ఓటమిపాలైంది. స్వ‌ర్ణానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు. సెమీస్‌లో గెలిచి తొలిసారి పతకం ఖాయం చేసుకుంది భారత్‌. ఆదివారం ఫైనల్లో థాయిలాండ్‌తో తలపడుతోంది భారత బ్యాడ్మింటన్ టీమ్.

శనివారం జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. డబుల్స్‌లో పుల్లెల గాయత్రి- ట్రీసా జాలీ సింగిల్స్‌లో అస్మిత, అన్మోల్‌ సంచలన విజయాలతో జట్టును ఫైనల్‌కు చేర్చారు. తొలుత జరిగిన సింగిల్స్‌లో పీవీ సింధు 13-21, 20-22తో అయా ఒహోరీ చేతిలో ఓటమిపాలైంది.

ఆ తర్వాత డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌, త్రిసాజాలీ జోడీ 21-17,16-21, 22-20తో ప్రపంచ ఆరో ర్యాంక్‌ ద్వయం నమి మత్సుయమ, చిహారు షిదాపై సంచలన విజయం సాధించింది. తమ(23వ ర్యాంక్‌) కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న వారిని గాయత్రి, త్రిసా మట్టికరిపించారు. మరో సింగిల్స్‌లో అశ్మిత 21-17, 21-14తో నజోమి ఒకుహరపై గెలువడంతో భారత్‌ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. 

డబుల్స్‌లో సింధు, అశ్విని ద్వయం 14-21, 11-21తో రీనా మియురా, అయాకో సకురామోటో జోడీ చేతిలో ఓడటంతో స్కోరు 2-2తో సమమైంది. సింగిల్స్‌లో అన్మోల్‌ 21-14, 21-18తో నత్సుకిపై గెలిచి భారత్‌ను ఫైనల్‌ చేర్చడంలో కీలకమైంది. చైనా ప్లేయర్‌ నిదైరాను ఓడించి భారత్‌కు 3-2 ఆధిక్యం చరిత్రాత్మక విజయాన్ని అందించింది. దీంతో భారత బ్యాడ్మింటన్ టీమ్‌ ఫైనల్‌కు చేరింది.