విశ్వవిద్యాలయాల్లో హిందూ దేవతలకు అవమానాలు!

విశ్వవిద్యాలయాలను సరస్వతి నిలయాలుగా భావిస్తుంటాము. కేవలం డిగ్రీలు ఉత్పత్తిచేసే కేంద్రాలుగా మాత్రమే కాకుండా యువతకు విద్య, బుద్దులు నేర్పి, వారిని సంస్కారవంతమైన పౌరులుగా తీర్చిదిద్దే ప్రదేశాలుగా, దేవాలయాలతో సమానంగా చూస్తుంటాము. అయితే, వాటిని కేంద్రాలుగా చేసుకొని యువతలో విషబీజాలు నాటేందుకు హిందూ వ్యతిరేక శక్తులు హిందూ దేవతలను అవమానపరిచే ఘటనలు ఇటీవల కాలంలో తరచుగా జరుగుతున్నాయి.
 
వివిధ సందర్భాలలో పలు విద్యాసంస్థలలో ఈ విధంగా దేవతా మూర్తులను అగౌరవపరచడాన్ని నిషేధించడం కూడా జరిగింది. తాజాగా, ఈ నెల 7న ఒపి
 జిందాల్ విశ్వవిద్యాలయం రామమందిరానికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అదేవిధంగా, ఫిబ్రవరి 3న, లలిత కళా కేంద్రం ప్రదర్శించిన ‘జబ్ వుయ్ మెట్’ అనే నాటకంలో రాముడు, సీతాదేవిలను అపహాస్యం చేసినందుకు మహారాష్ట్రలోని సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం ఒక ప్రొఫెసర్  తో పాటు ఐదుగురు  విద్యార్థులను అరెస్టు చేశారు.
 
హిందూ దేవతలను విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అవమానించిన 13 సంఘటనలను ఈ సందర్భంగా పరిశీలిద్దాము:
 
1. హర్యానాలోని ఒపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఈ నెల ఫిబ్రవరి 7న రివల్యూషనరీ స్టూడెంట్స్ లీగ్ ఆధ్వర్యంలో యూనివర్శిటీలో “రామమందిర్” పేరుతో ఒక కార్యక్రమం “బ్రాహ్మణీయ హిందుత్వ ఫార్సికల్ ప్రాజెక్ట్ ఫాసిజం” అంటూ నిర్వహించారు. వారు జనవరి 22ని విమర్శించారు రామమందిర ప్రారంభోత్సవ వేడుకలో బ్రాహ్మణీయ హిందూత్వ రాజ్యం అంతర్లీనంగా హింస, ప్రజా వ్యతిరేక ధోరణులు ఉన్నాయంటూ విమర్శలు గుప్పించారు.
 
ఈ సంఘటన రామమందిర భావనను ముడిపెడుతూ ముస్లింలు, దళితులపై విద్వేషపూరిత నేరాలకు పాల్పడుతున్నారంటూ, విద్య సంస్థలను కాషాయీకరణ కావిస్తున్నారని ఆరోపణలు చేశారు. చెప్పారు విద్యా సంస్థలు. హాజరైనవారిని వరవరరావు రచించిన  చదవమని వివాదాస్పద పుస్తకం “బ్రాహ్మణికల్ హిందుత్వ ఫాసిజంపై పోరాటం” చదవాలని ప్రోత్సహించారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన ఉగ్రవాది యాకూబ్ మెమోమ్ కు మద్దతుగా ఈ పుస్తకం వ్రాయడం గమనార్హం. 
 
2. ఫిబ్రవరి 3న మహారాష్ట్రాలో సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయంలో సీతా రాములను అనుచిత వాఖ్యలతో దూషిస్తూ  ‘జబ్ వి మెట్’ పేరుతో ఓ నాటకంను కళా కేంద్రంలో ప్రదర్శించారు. అందుకు కారణమైన లలిత కళాకేంద్రం విభాగ అధిపతి డాక్టర్ ప్రవీణ్ భోలేతో పాటు ఐదుగురు విద్యార్థులు భవేష్ పాటిల్, జే పెడ్నేకర్, ప్రథమేష్ సావంత్, రిషికేష్ దల్వి, యష్ చిఖ్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
 
3. గత ఏడాది అక్టోబర్ 22న ఉత్తర ప్రదేశ్ లోని  అలహాబాద్ విశ్వవిద్యాలయంలో  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ విక్రమ్‌ హరిజన రాముడు, కృష్ణుడులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రాముడిని ఐపీసీ సెక్షన్ 302 కింద జైలుకు పంపాలని, శ్రీకృష్ణుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. శ్రీకృష్ణుడు ఆడవారి బట్టలతో పారిపోతుండేవాడని పేర్కొన్నాడు. కల్నల్‌గంజ్‌ పోలీసు స్టేషన్ లో అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
 
4.గత ఏడాది అక్టోబర్ 3న మహారాష్ట్రలోని పూణే వద్దగల  సింబయాసిస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ లో అధ్యాపకుడు అశోక్ సోపన్ ధోలే (43)ను తరగతి గదిలో హిందూ దేవతలను దూషిస్తూ మాట్లాడినందుకు అరెస్ట్ చేశారు.  పైగా, కాలేజీ నుండి సస్పెండ్ కూడా చేశారు. ఐపీసీ  సెక్షన్ 295ఎ  (మతపరమైన విశ్వాసాలను కించపరిచే చర్యలు) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
 
5. ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు 2022 సెప్టెంబర్ 27న  కాలేజీ ఫెస్ట్  సందర్భంగా ఉద్దేశపూర్వకంగా ఒక సమయంలో శ్రీకృష్ణుడు, సుదామునిలను అవమానించారు. 2022. కామెడీ ఈవెంట్ పేరుతో విద్యార్థులు  భగవాన్ కృష్ణను అగౌరవపరిచడమే కాకుండా సుదామను తాగుబోతుగా  చిత్రీకరించారు.  నాలుగు రోజుల కార్యక్రమాన్ని రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్, ఆజాద్ మెడికోస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ వాఖ్యలపై నిరసనలు చెలరేగడంతో  అసోసియేషన్ హిందువుల మతపరమైన విశ్వాసాలను అగౌరవపరచినందుకు క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.
6. మే 9, 2022న గుజరాత్ లోని వడోదరలో మహారాజా సాయాజీరావు వడోదర విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్థులు హిందూ దేవతల అభ్యంతరకర చిత్రాలను ప్రదర్శించారు. ఫైన్ ఆర్ట్స్ ఫ్యాకల్టీ వార్షిక పెయింటింగ్ ఎగ్జిబిషన్ సందర్భంగా  విద్యార్థులు వివిధ అంశాలపై చిత్రాలను సిద్ధం చేశారు. కాగా కొందరు విద్యార్థులు హిందూ దేవుళ్ల చిత్రాల కటౌట్లను తయారు చేయగా, వారిలో కొందరు  దేవతలనగ్న చిత్రాలు వేశారు. అయితే, ఆ చిత్రాలను ఉపయోగించి అత్యాచారంగా వార్తలు వచ్చాయి.
 
7. ఏప్రిల్ 25, 2022న పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ జలంధర్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్  గుర్సాంగ్ ప్రీత్ కౌర్ ఒక ప్రసంగంలో హిందువుల దైవం శ్రీరాముడిని మోసకారి వ్యక్తిగా చిత్రీకరిస్తూ అభ్యంతకర వాఖ్యలు చేశారు. దానితో యూనివర్సిటీ ఆమెను సస్పెండ్ చేసింది.
 
8. ఏప్రిల్ 6, 2022న ఉత్తర ప్రదేశ్ లోని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జితేంద్ర కుమార్  ఫోరెన్సిక్ విభాగంలో అత్యాచారంలపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇస్తూ హిందూ దేవతలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. అతనిపై ఐపీసీ   ఐపీసీ 153ఎ, 295 ఎ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
9. అక్టోబర్ 17, 2021న ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎఐఐఎంఎస్)లో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థి సోయెబ్ అఫ్తాబ్  రామలీలా స్కిట్ ప్రదర్శన సందర్భంగా రామాయణమును అపహాస్యం చేస్తూ, అసభ్యమైన భాష ఉపయోగించాడు.  అందులో, భగవాన్ రామ్ శూర్పణఖతో  “అగర్ తుజే ఇత్నీ తారాక్ హై తో తు మేరే ఛోటే భాయ్…అనగా, శూర్పణఖ అప్పుడు లక్ష్మణుని దగ్గరకు వస్తుంది. బాలీవుడ్ పాట “తూ చీజ్ బడి హై మస్త్ మస్త్ పాడుతూ వస్తుంది.” దీనిపై హిందువులు అభ్యంతరం వ్యక్తం చేయగా ఎఐఐఎంఎస్ క్షమాపణలు చెబుతూ ప్రకటన జారీ చేసింది.
 
10. జనవరి 21, 2019న తమిళనాడు రాజధాని చెన్నైలోని లయోలా కళాశాల “వీడి విరుతు విజా” పేరుతో సాంస్కృతిక కార్యక్రమంగా  హిందూఫోబిక్ కళాకృతుల ప్రదర్శనను తన ప్రాంగణంలో అనుమతించింది.  ప్రదర్శనలో  హిందూ మతం, భారత మాత, హిందూ సంస్థల పట్ల అవమానకరమైన డ్రాయింగ్‌లు ఉన్నాయి. కళాఖండాల ప్రదర్శన హిందూ భావజాలాలను వెక్కిరించి, అవమానపరిచే రీతిలో ఉంచారు. ఆ తర్వాత అటువంటి ప్రదర్శన   నిర్వహించినందుకు కళాశాల క్షమాపణలు చెప్పింది.
 
11. నవంబర్ 26, 2018న తమిళనాడు చిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాల కళాశాల `కంబ రామాయణంలో పురుషాధిక్య ధోరణులు’, `కంబ రామాయణంలో శూర్పణకు ఎదురైనా అవమానాలు’, `విల్లిభారతంలో పంచాలి ఎదుర్కొన్న పురుష అణచివేత’. `మతాలలో మహిళలు గుర్తింపు తిరస్కరణ’ వంటి  అంశాలపై ఓ సెమినార్ కు పరిశోధనాపత్రాలు ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది. అయితే అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సెమినార్ ను వాయిదా వేశారు.
 
12. సెప్టెంబర్ 22, 2017న ఢిల్లీ విశ్వవిద్యాలయం దయాల్ సింగ్ కళాశాలలో  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేదార్‌ కుమార్‌ హిందూ దేవత దుర్గపై `అవమానకరమైన’ వాఖ్యలు చేస్తూ పేస్ బుక్ లో ఓ పోస్ట్ చేసాడు. దానిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
 
13. జూన్ 24,   2016న కర్ణాటకలోని మైసూర్ విశ్వవిద్యాలయంలో  కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం విభాగంలో బోధించే ప్రొఫెసర్ బిపి మహేష్ గురు  విద్యాబోధన సందర్భంగా హిందూ దైవం శ్రీరాముడి పట్ల అవమానకరంగా వాఖ్యలు చేయడం, భగవద్గితను తగలబెట్టమని పిలుపు ఇవ్వడంతో అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ నుండి సస్పెండ్ చేశారు.