అండర్-19 ప్రపంచకప్‍-2024 ఫైనల్‍లో భారత్ కు నిరాశ

అండర్‌-19 ప్రపంచకప్‌లో అపజయం ఎరగకుండా.. ఫైనల్‌ చేరిన యువభారత జట్టుకు చివర్లో చుక్కెదురైంది. ఆదివారం జరిగిన తుదిపోరులో యంగ్‌ఇండియా 79 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఈ టోర్నీలో అడుగుపెట్టి వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన యంగ్‌ఇండియా.. అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.

హర్జాస్‌ సింగ్‌ (55; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం సాధించగా.. కెప్టెన్‌ వైబ్‌గెన్‌ (48), హ్యారీ డిక్సన్‌ (42), ఒలీవర్‌ (46*) రాణించారు. గతేడాది భారత్ సీనియర్ టీమ్ కూడా వన్డే ప్రపంచకప్‍లో ఫైనల్‍లో అడుగుపెట్టగా ఆస్ట్రేలియానే దెబ్బకొట్టింది. ఇప్పుడు భారత అండర్-19 జట్టును కూడా ఆసీస్ యువ జట్టు తుదిపోరులో దెబ్బ తీసింది. 

దక్షిణాఫ్రికాలోని బెనోనీ వేదికగా ఆదివారం జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‍లో భారత్ 79 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. డిఫెండింగ్ ఛాంపియన్‍గా ఈ ఏడాది టోర్నీలో అడుగుపెట్టిన భారత్ రన్నరప్‍తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా నాలుగోసారి అండర్-19 ప్రపంచకప్ సాధించింది.

భారత బౌలర్లలో రాజ్‌ లింబాని 3, నమన్‌ తివారి రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం అండర్‌ ప్రపంచకప్‌ ఫైనల్స్‌ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యంగ్‌ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. ఆదర్శ్‌ (47), మురుగన్‌ అభిషేక్‌ (42) కాస్త పోరాడగా.. కెప్టెన్‌ ఉదయ్‌ సహరాన్‌ (8), సచిన్‌ దాస్‌ (9), అర్షిన్‌ (3), ప్రియాన్షు (9), అవవెల్లి అవనీశ్‌ రావు (0) విఫలమయ్యారు.

ఆసీస్‌ బౌలర్లలో మహ్లీ బ్రాడ్‌మన్‌, మెక్‌మిలన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మహ్లీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, ఆసీస్‌ పేసర్‌ క్వెన ఎంపెకాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (47) మొదట్లో ఆకట్టుకోగా, చివర్లో మురుగన్ అభిషేక్ (42) పోరాడాడు. అయితే, ముఖ్యమైన ఈ ఫైనల్‍లో మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో టీమిండియాకు ఓటమి ఎదురైంది. 

ఏడుగురు భారత బ్యాటర్లు సింగిల్ డిజిట్‍కే పరిమితమై నిరాశపరిచారు. ముషీర్ ఖాన్ (22) కాసేపు నిలువగా, భారీ అంచనాలు పెట్టుకున్న కెప్టెన్ ఉదయ్ సహరన్ (8), సచిన్ దాస్ (9) కీలకమైన తుదిపోరులో విఫలమయ్యారు.  మొత్తంగా ఐదుసార్లు అండర్-19 ఛాంపియన్ టీమిండియాకు ఈసారి ఆస్ట్రేలియా షాకిచ్చింది.

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో  7 వికెట్లకు 253 పరుగులు చేసింది. ఆసీస్ తరఫున భారత సంతతి ప్లేయర్ హర్జాస్ సింగ్ (55) హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఒలీవర్ పీక్ (46 నాటౌట్), హ్యారీ డిక్సన్ (42) కూడా రాణించారు. భారత పేసర్ రాజ్ లింబానీ 10 ఓవర్లలో 38 పరుగులే ఇచ్చి మూడు వికెట్లతో రాణించాడు. నమన్ తివారీ రెండు వికెట్లు తీసుకున్నాడు.