`లవ్ జిహాద్’పై ఆగ్రవేశం… దిక్కుతోచని `సెక్యూలర్’ ముఠా!

 
* మతమార్పిడి బాధితుడు మహాత్మా గాంధీ!
 
జర్నలిస్టులు శ్రీనివాసన్ జైన్, మరియం అలవి, సుప్రియా శర్మ రచించిన “లవ్ జిహాద్ అండ్ అదర్ ఫిక్షన్స్: సింపుల్ ఫ్యాక్ట్స్ టు కౌంటర్ వైరల్ ఫాల్స్‌హుడ్స్” అనే పుస్తకాన్ని జనవరి 31న ఢిల్లీలోని కాన్స్‌టిట్యూషన్ క్లబ్ లో హాట్టహాసంగా విడుదల చేశారు. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా `లవ్ జిహాద్’ కుతంత్రాలకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యం అవుతూ ఉండటం, ఇప్పటికే 11 రాష్ట్రాల్లో `లవ్ జిహాద్’ నిషేధిస్తూ చట్టాలు తీసుకు రావడంతో తమ కుట్రలు బహిర్గతం అవుతున్నాయని సూత్రధారులకు దిక్కుతోచడం లేదని ఈ సభలో ప్రసంగాల ధోరణి వెల్లడి చేస్తుంది.
 
`లవ్ జిజాద్’ అన్నది ఓ అభూత కల్పన అని, అసలు ఉనికిలో లేదని నిర్ధారించడం కోసమే ఈ `పరిశోధనాత్మక’ గ్రంధాన్ని తీసుకు వచ్చినట్లు ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్ మోడరేట్ చేసిన ఈ సభలో ముగ్గురు రచయితలతో మాటా మంతి జరిపిన  న్యాయవాది వృందా గ్రోవర్, కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీలు నచ్చచెప్పేందుకు `విఫల ప్రయత్నం’ చేసిన్నట్లు స్పష్టం అవుతుంది.
 
ఇటువంటి కుతంత్రాలకు ఎల్లప్పుడూ అండగా నిలబడుతున్న వీరితో పాటు ఆర్థికవేత్త జీన్ డ్రేజ్, చరిత్రకారిణి రొమిలా థాపర్, ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, మాజీ న్యూస్ యాంకర్ నిధి రజ్దాన్‌తో సహా పలువురు ఈ సభకు హాజరైన వారిలో ఉండటం గమనార్హం.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ మజ్లీస్ అధినేత ఒవైసీ `లవ్ జిహాద్’ కుట్రలను బహిర్గతం చేస్తున్న హిందూ సమాజం `దాడులను’ ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు విఫలం అవుతున్నాయని, ఈ విషయంలో వారు `తమదైన’ కధనాన్ని ప్రచారం చేయాలని చెప్పారు. అయితే ఏ విధంగా చేయాలో తనకు కూడా తెలియదని ఒప్పుకున్నారు. `లవ్ జిహాద్’ అనేడిదే ఓ అభూత కల్పన అని, అసలు మనుగడలో లేదని చెప్పేందుకు వక్తలందరూ విఫల ప్రయత్నం చేశారు.
 
వలసవాద వారసత్వం సెక్యులరిస్ట్ పాలనలో కొనసాగింది. దీని ఫలితంగా హిందువులు బహుశా ప్రపంచంలోని ఏకైక మెజారిటీ కమ్యూనిటీ అయినప్పటికీ `మైనారిటీ మనసత్త్వం’తో మతమార్పిడి వ్యతిరేక చట్టాలు అవసరమయ్యే  దుస్థితిలో చిక్కుకున్నారు. హిందూ యువతిని ఇస్లాంలోకి మార్చేందుకు మోసం చేసి పెళ్లి చేసుకోవడాన్ని `లవ్ జిహాద్’గా భావిస్తున్నారు.
 
`లవ్ జిహాద్’ బాధితులు ఎక్కువగా దళిత బాలికలే
 
మనదేశంలో ఓ కుట్రపూరితంగా ఇటువంటి ప్రయత్నాలు చాలా సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఆ విధంగా బాధితులైన హిందూ బాలికలతో అత్యధికులు దళిత, అణగారిన వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం. `లవ్ జిహాద్‌’ కుట్రల నుండి అణగా మహిళలకు రక్షణ కల్పించేందుకు గత కొద్ది సంవత్సరాలలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకు వచ్చాయి. 
 
మరోవంక, ఈ దుర్మార్గంపై మీడియాలో విస్తృతమైన చర్చలు ప్రారంభం కావడంతో విస్తృత సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, దీనిని “హిందువులు- ముస్లింల మధ్య చీలిక తెచ్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర” అని నిందారోపణలతో కొట్టిపారవేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. “ఆర్ఎస్ఎస్- మైనారిటీల” వివాదంగా ఈ సమస్యను కుంచించే `లౌకికవాదులే’ పన్నాగాలు సహితం ఇప్పుడు బెడిసి కొడుతున్నాయి.
 
ఇద్దరు యువతీ, యువకులు ప్రేమ వివాహాలు చేసుకోవడం పట్ల ఎవ్వరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ప్రేమ పేరుతో యువతులను మాత్రమే బలవంతంగా మతం మార్చడం, ఆ తర్వాత వారిని బానిసలుగా మలచుకోవడం గమనిస్తే దీనిని వెనుక ఓ భారీ కుట్ర ఉండనే నగ్నసత్యాన్ని దేశంలో పలు ఘటనలు వెల్లడి చేశాయి. దానితో సమాజంలో ఆగ్రవేశాలు సహితం చెలరేగుతున్నాయి.
 
స్వచ్ఛమైన భావోద్వేగంతో వివాహంపై సిద్దపడే ఇద్దరు వ్యక్తులకు నైతిక, చట్టపరమైన, సామాజిక మద్దతు ఇవ్వాల్సిన ఉందనడంలో మరో అభిప్రాయానికి అవసరం లేదు. భారతీయ సంప్రదాయంలో ప్రేమ ఆధ్యాత్మికతకు శ్రేష్ఠమైనది. పరస్పర అంగీకారంపై ఆధారపడి ఉంటే  వ్యక్తుల మధ్య వివాహాలను స్వాగతిస్తాము. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. కుల, మతాలతో ప్రమేయం లేకుండా అనేకమంది ఇటువంటి వివాహాలు చేసుకొని ఆనందదాయకమైన జీవనం గడుపుతున్నారు. అటువంటి వారి పట్ల ఎటువంటి వివక్షత, వ్యతిరేకత చేయడం లేదు.
 
అయితే,  నిగూఢమైన ఉద్దేశ్యాలు, అబద్ధాల ఆధారంగా, ప్రలోభాలకు గురిచేసి లొంగదీసుకుని వంచించే ప్రయత్నం జరిగినప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి. కేవలం హిందూ బాలికలు తన మతపరమైన గుర్తింపు, స్వేచ్ఛను బలవంతంగా కోల్పోయే విధంగా చేస్తున్నప్పుడు సహజంగానే అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఆ విధంగా అనేక మంది బాధితులైన అనేకమంది బాలికల ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 
 
 హిందూ లేదా క్రిస్టియన్ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలను వివాహం చేసుకొని, బలవంతంగా మతం మార్చడం వంటి కేసులు అనేకం వెలుగులోకి రావడంతోనే నేడు “లవ్ జిహాద్” ఓ సామాజిక ప్రమాదంగా, జాతీయ సమగ్రతకు, భద్రతకు సవాల్ గా పరిణమించింది.
 
బ్రిటిష్ పార్లమెంట్ లో మొదటి `లవ్ జిహాద్’
 
ఈ సమస్య మొదటిసారిగా బ్రిటిష్ పార్లమెంటులో కనిపించడం గమనార్హం. మోతీలాల్ నెహ్రూ కుమార్తె సయ్యద్ అన్సారీ అనే ముస్లింతో కలిసి పారిపోయిందని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా “జాడలేని” ఫైల్ వెల్లడి చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరినీ గుర్తించడంతో వారు విడిపోయారు.
 
జార్ఖండ్‌లో షూటర్ అయిన తారా సహదేయో తాజాగా వెలుగులోకి వచ్చిన తీవ్రమైన ఉదాహరణ. 2012లో 2,667 మంది బాలికలను ఇస్లాంలోకి మార్చారని కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అంగీకరించారు. అయితే, వాస్తవానికి ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటువంటి వివాహాలను నిజమైన `లౌకికవాదులు’ ఎవ్వరూ ఆమోదింపరాని చెప్పవచ్చు.
 
సాంప్రదాయ ఇస్లామిక్ సమాజం విగ్రహారాధన చేసే స్త్రీని ఇస్లామిక్ కుటుంబం, సంస్కృతి, సమాజంలో భాగంగా అంగీకరించగలదా? లేదా? అనే వాస్తవ సమస్యను ఎవరైనా తప్పించుకోగలరా? అన్నది ఈ సందర్భంగా కీలకమైన ప్రశ్న. అందుకనే ఇటువంటి వివాహాలలో హిందూ మహిళలు అతిపెద్ద బాధితులు అని చెప్పవచ్చు. 
 
1920లో రూట్టీ అనే పార్సీని వివాహం చేసుకున్న మొహమ్మద్ అలీ జిన్నా కూడా ఆమెను మొదట ఇస్లాంలోకి మార్చాడు. తన పెద్ద కుమారుడు హీరాలాల్ ఇస్లాం స్వీకరించినప్పుడు మహాత్మా గాంధీ కూడా మతమార్పిడి దుర్భరమైన ఫలితాన్ని ఎదుర్కొన్నారు. ఆయన మే 29, 1936న ముంబైలో ఇలా చెప్పారు:
 
 “ఈ అంగీకారం హృదయం నుండి వచ్చిందా? లేదా స్వార్థ పరిగణనలు నుండి వచ్చిందా? అన్న దానిపై నాకు తీవ్ర సందేహం ఉంది. నా కొడుకు హీరాలాల్ కొన్నాళ్లుగా మద్యానికి అలవాటు పడ్డాడని, పేరుమోసిన వారి ఇళ్లకు వెళ్లడం అలవాటు చేసుకున్నాడని తెలిసిన వాళ్లందరికీ తెలుసు. కొన్నాళ్లుగా తనకు ఎనలేని సహాయం చేసిన స్నేహితుల దానధర్మంతో జీవిస్తున్నాడు. అతను భారీ వడ్డీకి అప్పు తీసుకున్న కొంతమంది పఠాన్‌ల నుండి అప్పులు చేశాడు. ఇటీవలి వరకు అతను బొంబాయిలోని తన పఠాన్ రుణదాతల నుండి ప్రాణభయంతో ఉన్నాడు. కానీ ఇప్పుడు అతను నగరంలో హీరో”.
 
జూన్ 6, 1936న హరిజన్‌లో గాంధీ ఇలా వ్రాసారు: “హీరాలాల్ మత భ్రష్టత్వం వల్ల హిందూమతానికి ఎటువంటి నష్టం లేదు.  అతను ఇస్లాంలోకి ప్రవేశించడం వల్ల అతను ఇంతకు ముందు ఉన్న శిథిలావస్థలోనే ఉండిపోతే అది బలహీనతకు మూలం.”
 
నార్కోటిక్ జిహాద్‌
1921 సెప్టెంబరు 9న, కేరళలోని సిరో మలబార్ చర్చి పాలా డియోసెస్ బిషప్ మార్ జోసెఫ్ కల్లారంఘట్ కొట్టాయంలో ఒక మతపరమైన సమావేశంలో ప్రసంగిస్తూ, “జిహాదీలు” క్రైస్తవ మహిళలను “లవ్ జిహాద్, నార్కోటిక్ జిహాద్‌తో లక్ష్యంగా చేసుకుంటున్నారని” హెచ్చరించారు.”. కల్లారంఘట్ క్రైస్తవ స్త్రీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 
 
2016లో కేరళ నుంచి డజనుకు పైగా ప్రజలు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో చేరేందుకు వెళ్లిన ఘటనను బిషప్ ప్రస్తావించారు. ‘లవ్ జిహాద్’ ఉందని పోలీసు అధికారులు ఒప్పుకుంటున్నారని, అయితే రాజకీయ నాయకత్వం అలాంటి బెదిరింపును కొట్టిపారవేస్తున్నదని బిషప్ చెప్పడంతో ఆయన  వ్యాఖ్యలు సిపిఎం ప్రభుత్వం నైజాన్ని బహిర్గతం చేసినట్లయింది. 
 
భారతదేశంలో లౌకికవాదం మూడు కారణాల వల్ల దెబ్బతింటుంది. మొదటిది, ఉమ్మడి పౌరస్మృతి లేకపోవడం. ఇది లింగ సమస్యను మతపరమైనదిగా మారుస్తుంది. రెండవది, వ్యవస్థీకృత మతమార్పిడి ప్రచారాలు సామాజిక- మత సమతౌల్యాన్ని ఎక్కువగా అస్థిరపరుస్తాయి. మూడవది, మతం స్వాతంత్య్రం అనే  ప్రాథమిక హక్కు అనూహ్యమైన మతమార్పిడి ద్వారా విచ్ఛిన్నమవుతున్నది.