ఫిబ్రవరిలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉన్నది. గతేడాది నవంబర్‌ – డిసెంబర్‌ మధ్య కేసులు భారీగా పెరిగాయి. అయితే, ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా మరోసారి మహమ్మారి విరుచుకుపడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కరోనా విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. 
 
ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్ల నుంచి కొత్తగా వైరస్‌ల కారణంగా ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందని వారిస్తున్నారు. అయితే, కరోనా ప్రస్తుతం నియంత్రణలో ఉన్నప్పటికీ వేసవిలో కేసులు పెరిగే అవకాశం ఉందని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది.  దేశంలో పాజిటివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తుందని, ప్రమాదం ఇంకా ముగియలేదని చెబుతుందని గ్లోబల్‌ టైమ్స్‌  కధనం తెలిపింది.
రాబోయే నెలల్లో ముఖ్యంగా వేసవిలో జన సంచారం, వాతావరణంలో మార్పులతో కరోనా ప్రమాదం మళ్లీ పెరిగే అవకాశం ఉందని చెప్పింది. నివాచరణ చర్యలు కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపింది.  చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధకుడు చెన్ కావో మాట్లాడుతూ ప్రస్తుతం ఒమిక్రాన్‌ జేఎన్‌.1 వేరియంట్‌ చైనాతో పాటు చాలా దేశాల్లో కేసులు రికార్డయ్యాయని, ఇది ఇన్ఫెక్షన్‌కు ప్రధాన కారణమని అంచనా వేస్తున్నారు.ఇటీవల చైనా, అమెరికా, సింగ్‌పూర్‌తో సహా అనేక దేశాల్లో కరోనా కేసులు పెరిగేందుకు ఈ వేరియంటే ప్రధాన కారణమని గుర్తించారు. జేఎన్‌.1 వేరియంట్‌ సోకిన చాలా మందిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపించాయి. అయితే, ఆందోళన కలిగించే విషయం ఏంటంటేఇన్ఫెక్షన్‌ రేటు చాలా ఎక్కువగా ఉన్నది. 

స్ప్రింగ్‌ ఫెస్టివల్‌ 10-17 వరకు కొనసాగనుండగా  చాలా ప్రాంతాల్లో వేడుకలు జరుగనున్నాయి. చైనీస్‌ నూతన సంవత్సరంగా భావించే ఈ పండుగా చానీయులకు చాలా ముఖ్యమైనది.  పిలుస్తుంటారు. పండుగ నేపథ్యంలో భారీగా జనం గుమిగూడే అవకాశం ఉంటుందని, అజాగ్రత్తగా ఉంటే ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. 

బీజింగ్‌లోని ఓ ఆసుపత్రికి చెందిన అంటువ్యాధుల చీఫ్‌ ఫిజిషియన్‌ లీ టోంగ్‌జెంగ్‌ మాట్లాడుతూ ఇన్‌ఫ్లుయెంజా కేసులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ తర్వాత కొవిడ్‌ రోగుల సంఖ్య ఉందని, వసంతకాలంలో ఇన్ఫెక్షన్‌ పెరిగే ప్రమాదం ఉంటుందని అంచనా వేశారు.