`భారతీయత’ పట్ల నిర్లక్ష్యంకు ఇప్పుడు తెరపడింది

స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు అవుతున్నా, స్వాతంత్య్రంలోని `స్వా’ (స్వతంత్ర), భారత్ లోని `భారతీయత’ పట్ల ప్రజలు సగర్వంగా భావించేందుకు చాలా సమయం పట్టిందని, కానీ అది నిదానంగా జరుగుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ తెలిపారు. ఏ రంగంలోనైనా `భారతీయత’తో పనిచేసే వ్యక్తులు నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చారని విచారం వ్యక్తం చేశారు. అయితే అటువంటి నిర్లక్ష్యంకు ఇప్పుడు ముగింపు పడినట్లే అని చెప్పారు.
 
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో సంస్కార్ భారతి నిర్వహించిన అఖిల భారతీయ కళాసధక్ సంగమంలో `భరతముని సమ్మాన్‌’ పురస్కారాలను  ప్రముఖ జానపద కళాకారుడు గణపత్ సఖారామ్ మాస్గే, చిత్రాలకు ప్రసిద్ధి చెందిన విజయ్ దశరథ్ అచ్రేకర్‌లకు  బహూకరించారు. సంస్కార్ భారతి అధ్యక్షుడు వాసుదేవ్ కామత్, పురస్కారాల సంయోజకుడు సుబోధ్ శర్మ, ఆర్ఎస్ఎస్ దక్షణ మధ్య క్షేత్ర ప్రచారం సుధీర్ సమక్షంలో అందజేశారు.
 
భారతీయ కళలను కళలను అనుసరిస్తూ, సమాజాన్ని వాటిని పరిచయం చేస్తున్న కళాకారులను గుర్తించి, గౌరవించడం మొదటిసారిగా జరుగుతున్నదని చెబుతూ ఇదొక్క చారిత్రక ఘటన అని డా. భగవత్ కొనియాడారు.  భారత్ నెమ్మదిగా మేల్కొంటుంది, అది తనను తాను గుర్తించుకుంటుందని తెలిపారు.
జనవరి 22న రామమందిరంలో తాను చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ, రామమందిరాన్ని ప్రారంభించినప్పుడు భారత్ `స్వా’ (స్వాతంత్య్రం) తిరిగి వచ్చిందని చెప్పానని పేర్కొన్నారు.
ప్రతి రంగంలోనూ, భరత్ `స్వా’ భవిష్యత్తులో స్పష్టంగా కనిపిస్తుందని స్పష్టం చేశారు.  రామమందిర ప్రారంభోత్సవం తర్వాత సంస్కార భారతి ద్వారా అటువంటి గుర్తింపు మొదటిసారి జరగడం గమనించదగ్గ వాస్తవం అని తెలిపారు.  మానవ జీవితంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని చెబుతూ కళల గుర్తింపు కరుణ ద్వారానే సాధ్యమని చెప్పారు.
సానుభూతి, కరుణ లేకుండా కళలు ఉండవని స్పష్టం చేశారు. పుట్టినప్పటి నుండి మానవుని సమగ్ర వికాసానికి, కరుణను, సున్నితత్వాన్ని అలవర్చుకోవడానికి, మానవుని నాగరికతను సంతరించుకోవడానికి వివిధ రకాల కళలు ప్రయత్నిస్తాయని డా. భగవత్ వివరించారు.  నాగరికత లేని మానవుడు మానవుడు కాలేడని పేర్కొంటూ వినోదంతో కళల అనుబంధం తక్కువగా ఉంటుందని, అయితే అది మానవుని సమగ్ర ప్రగతికి సంబంధించినదని అని చెప్పారు.
కళలు మానవులను మానవీయంగా మారుస్తాయి కాబట్టి కళాకారులకు గుర్తింపు అవసరమని తెలిపారు.   కళలు సంస్కృతి కృషి ఫలితమే అని చెబుతూ కళలు, సంస్కృతిని విడిగా చూడలేమని సర్ సంఘచాలక్ స్పష్టం చేశారు. `స్వా’, `భారతీయత’లను సజీవంగా ఉంచడంలో కళాకారుల సహకారాన్ని ప్రస్తావిస్తూ అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. వారి కృషిని ఇప్పుడు మనం గుర్తుంచుకుంటున్నామని చెప్పారు.
 
సమాజానికి ఉపయోగపడే ఇలాంటి మంచి పనిని కళాకారులు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. భారతీయ కళలకు ప్రపంచ కళలకు మార్గాన్ని చూపించే సామర్థ్యం ఉందని చెబుతూ సాంస్కృతిక విలువలు దిగరాజేందుకు దోహదపడుతున్న ప్రజల దృక్పథాన్ని మార్చడానికి కూడా కళలు ఎంతగానే ఉపయోగపడతాయని ఆయన చెప్పారు.
 
పురాతన కాలంలో కళాకారులను రాజులు గుర్తించేవారని, కానీ ఆధునిక ప్రపంచంలో, ఇది సామాజిక అవసరం కావడంతో ప్రజా సంస్థల ద్వారా చేయాల్సి ఉందని, అందుకనే  సంస్కార భారతి ఈ కార్యాన్ని చేబట్టిందని ఆయన తెలిపారు.  భారతీయ కళలు, లలిత కళలు, సంస్కృతికి చెందిన కళాకారులను గుర్తించి, ప్రోత్సహించేందుకు సంస్కార్ భారతి చేసిన కార్యక్రమాలలో ఒకటిగా `భరతముని సమ్మాన్‌’ను మొదటిసారిగా ప్రదానం చేశారని చెప్పారు.
 
సర్టిఫికేట్, రూ. 1.51 లక్షల నగదుతో కూడిన పురస్కారాల ప్రధానం తర్వాత  సమర్పణ వేడుక తర్వాత, `కృష్ణ కహే’ అనే చిన్న నాటకాన్ని మహాభారత్ సిరీస్ ఫేమ్ నితీష్ భరద్వాజ్ శ్రీ కృష్ణుడిగా, అతని బృందం సమానత్వాన్ని సూచిస్తూ ప్రదర్శించింది. వర్ణం వృత్తిపై ఆధారపడి ఉందని, దానిని కులంగా తప్పుగా భావించారని వారు పేర్కొన్నారు.
 
రథాన్ని తయారు చేయడంలో ప్రతి వృత్తి సమానంగా ముఖ్యమైనదని రంగస్థల ప్రదర్శన చూపించింది. సమానత్వాన్ని చూసే, ఏ విధమైన తారతమ్యం లేకుండా సమానత్వాన్ని పాటించే భక్తులకు శ్రీ కృష్ణుడు దర్శనమిస్తాడని తెలిపింది.
 
దీని తరువాత రామాయణంలో స్నేహం, సామాజిక సామరస్యాన్ని ప్రదర్శించే `ఛౌ’ నృత్యం ప్రదర్శించారు. `చౌ’ నృత్యం అనేది భారతదేశం తూర్పు భాగం నుండి వచ్చిన సంప్రదాయం. ఇది మహాభారతం, రామాయణం, స్థానిక జానపద కథలు,  నైరూప్య ఇతివృత్తాలతో సహా ఇతిహాసాల నుండి వృత్తాంతాలను ప్రదర్శిస్తుంది.