కేంద్ర బడ్జెట్ స్వరూపం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ స్వరూపం:

  • 2024-25 బడ్జెట్ అంచనాలు
    రుణాలు కాకుండా మొత్తం రసీదులు : రూ. 30.80 లక్షల కోట్లు
  • మొత్తం వ్యయం : రూ. 47.66 లక్షల కోట్లు
  • పన్ను రసీదులు : రూ. 26.02 లక్షల కోట్లు
  • 2024-25లో ద్రవ్యలోటు జిడిపిలో 5.1%గా అంచనా వేయబడింది
  • 2023-24 సవరించిన అంచనాలు
    రుణాలు కాకుండా మొత్తం రశీదుల  సవరించిన అంచనాలు రూ. 27.56 లక్షల కోట్లు(ఇందులో పన్ను రసీదులు రూ. 23.24 లక్షల కోట్లు)
  • మొత్తం వ్యయం రూ. 44.90 లక్షల కోట్లు
  • రెవెన్యూ వసూళ్లు రూ. 30.3 లక్షల కోట్లు బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా
  • ద్రవ్యలోటు జిడిపిలో 5.8%
  • 4 కోట్ల మంది రైతులకు పంటల బీమా
  • 34 లక్షల పేదలకు నేరుగా నగదు బదిలీ
  •  80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను అందించాం
  • 25 లక్షల మందిని పేదరికం నుండి బయటపడేసాం
  • కార్పోరేట్‌ ట్యాక్స్‌ 30 శాతం నుండి 22 శాతానికి తగ్గింపు.
  • రూ.34 లక్షల కోట్లు డిబిటి ద్వారా ప్రజలకు అందించాం.
  • ఇంటింటికీ తాగునీరు, కరెంట్‌, ఉపాధి కల్పనతో సమ్మిళిత అభివృద్ధి సాధించాం
  • అన్నదాతల కోసం 11.8 కోట్ల మందికి ఆర్థిక సాయం
  • 30 కోట్ల మంది మహిళలకు ముద్రా రుణాలను అందించాం.
  • కోటి గృహాలకు సోలార్‌ రూఫ్‌ టాప్‌ ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌.
  • ఆశావర్కర్లు అందరికీ ఆయుష్మాన్‌ భారత్‌.
  • ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది.
  • స్కిల్‌ ఇండియా మిషన్‌ కింద 1,4 కోట్ల మంది యువతకుశిక్షణ.
  • పౌర విమానరంగాన్ని బలోపేతం చేస్తున్నాం. 1000 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చాం. 517 ప్రాంతాలకు కొత్తగా విమాన సర్వీసులు.
  • యువత కోసం లక్ష కోట్లతో దీర్ఘకాలిక కార్పస్‌ ఫండ్‌.
  • వందే భారత్‌, నమో భారత్‌తో రైల్వే వ్యవస్థ బలోపేతం. 41వేల రైల్వే కోచ్‌లను వందేభారత్‌ కింద మార్పు.
  • కొత్త టాక్స్‌ విధానంలో 7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు.
  • టూరిస్ట్ హబ్ గా లక్షద్వీప్.. టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు వడ్డీలేని రుణాలు.. లక్షద్వీప్ లో టూరిజం అభివృద్దికి మౌళిక వసతులు పెంపు..
  • బియ్యం ధర నియంత్రణకు కేంద్రం నిర్ణయం. రేపటి నుండి మార్కెట్ లోకి భారత్ బియ్యం.  కేజీ 29 రూపాయలకు అమ్మాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం.
  • మత్య్సరంగంలో 55 లక్షల ఉద్యోగాలు కల్పించాం. సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతులు రెండింతలు పెరిగాయి.
  • కేంద్ర పథకాలకు కేటాయింపులు ఇలా :  గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 86 వేల కోట్లు, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 600 కోట్లు, సోలార్ విద్యుత్ గ్రిడ్ 8500 కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు 6200 కోట్లు, ఆయుష్మాన్ భారత్ కు 7500 కోట్లు, సెమీ కండక్టర్స్ డిస్ప్లే ఎకో వ్యవస్థల తయారీకి 6903 కోట్లు