మూడు ఉపగ్రహాలను ప్రయోగించిన ఇరాన్

ఇరాన్ ఆదివారం ఏకకాలంలో ముడు ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. స్వదేశీయంగా రూపొందించిన సిమోర్గ్ రాకెట్ వాటిని 450 కిమీ ఎత్తున ఉన్న కక్ష్యలోకి మార్చగలిగింది. గతంలో అనేక వైఫల్యాలను ఎదుర్కొన్న సిమోర్గ్‌ రాకెట్‌ను కూడా ఇరాన్‌ విజయవంతంగా ప్రయోగించిందని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఆర్‌ఎన్‌ఎ వార్తా సంస్థ ఆదివారం ప్రకటించింది. 
 
సిమోర్గ్‌ రాకెట్‌ను ప్రయోగిస్తున్న దృశ్యాలను ఇరాన్‌ ప్రభుత్వ టెలివిజన్‌ విడుదల చేసింది. ఈ మూడు ఉపగ్రహాల్లో 35 కిలోల బరువున్న ఉపగ్రహం ఒకటి కాగా, మిగిలిన రెండూ 10 కిలోల బరువున్న నానో శాటిలైట్లు. వీటితో జియో పొజిషనింగ్ టెక్నాలజీ , కమ్యూనికేషన్లను పరీక్షించనున్నారు. వీటిలో పెద్ద ఉపగ్రహాన్ని మహ్దగా మిగిలిన వాటిని కహ్యాన్ 2, హతెఫ్1 అని వ్యవహరిస్తున్నారు. ఇరాన్ స్పేస్ ఏజెన్సీ వీటిని రూపొందించింది.
ఇరాన్‌లోని సెమ్నాన్‌ ప్రావిన్స్‌లోని ఇమామ్‌ ఖమేని స్పేస్‌ పోర్ట్‌లో ఈ ప్రయోగం జరిగింది. మహ్దా, కెహాన్‌-2, హతేఫ్‌-1లను ప్రయోగించినట్లు తెలిపింది. 
ఇది మహ్దాను పరిశోధనా ఉపగ్రహంగా అభివర్ణించింది. కెహాన్‌, హతేఫ్‌ ఉపగ్రహాలు వరుసగా గ్లోబల్‌ పొజెషినింగ్‌, కమ్యూనికేషన్‌పై దృష్టి సారించిన నానో ఉపగ్రహాలుగా పేర్కొంది. వివిధ రకాల పేలోడ్‌లను అంతరిక్షం లోకి చేర్చడంలో సిమోర్గ్ రాకెట్ ఎంతవరకు కచ్చితత్వంగా ఉందో ఈ సందర్భంగా పరీక్షించారు.
 
 ఈనెల లోనే ఇరాన్ సొరయా అనే 50 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని 750 కిమీ ఎత్తునున్న కక్ష లోకి పంపింది. దీన్ని ఆదేశానికి చెందిన సైనిక విభాగం ఐఆర్‌జిసి తయారు చేసింది. రాత్రివేళ జరిగిన ఈ ప్రయోగ దృశ్యాలు ప్రభుత్వ టీవీ చానెల్స్‌లో ప్రసారం చేశారు. సెమ్నాన్ ప్రావిన్స్ లోని ఇమామ్ ఖొమైనీ స్పేస్ పోర్టులో దీన్ని నిర్వహించినట్టు ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. ఉపగ్రహ ప్రయోగాలతో ఇరాన్‌ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ధిక్కరిస్తున్నాయని అమెరికా గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అణ్వాయుధాలను పంపిణీ చేయగల బాలిస్టిక్‌ క్షిపణులతో కూడిన ఎటువంటి కార్యకలాపాలను చేపట్టవద్దని ప్రజలకు పిలుపునిచ్చింది. ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమానికి సంబంధించిన యుఎన్‌ ఆంక్షలు గత అక్టోబర్‌లో ముగిశాయి.